'ఉత్త'ర కుమారుడే: రెక్కలు తెగిన పక్షిలా కాంగ్రెస్ విలవిల

First Published Mar 20, 2019, 12:07 PM IST

టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌  కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  ఆత్మరక్షణలో పడిపోయింది. పది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు  టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టారు

టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. పది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరడం కూడ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
undefined
ఈ నెల 12వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా గూడురు నారాయణరెడ్డిని బరిలోకి దింపింది. అయితే ఈ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.
undefined
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావులు తొలుత టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాకు చెందిన చిరుమర్తి లింగయ్య కూడ ఇదే బాటలో నడిచారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ కూడ టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల నుండి కాంగ్రెస్ పార్టీ వైదొలిగింది.
undefined
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడ సబితా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వర్ రావు, సుధీర్ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డిలు కూడ టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. బుధవారం నాడు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కూడ కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
undefined
టీఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రూపంలో మరింత దెబ్బ తగిలింది. టీఆర్ఎస్‌లో చేరడం ఇష్టం లేని నేతలకు బీజేపీ వల వేసింది. మాజీ మంత్రి డీకే అరుణతో బీజేపీ నేతలు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో డీకే అరుణ మంగళవారం నాడు రాత్రి బీజేపీలో చేరారు.
undefined
డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సోయం బాబురావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడ బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డికి మాత్రం కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు. యెన్నం గతంలో టీఆర్ఎస్, బీజేపీలలో కూడ కొనసాగిన విషయం తెలిసిందే.
undefined
నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వీరితో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్‌కు చెందిన అసంతృప్త నేతలతో కూడ బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం.
undefined
తెలంగాణ రాష్ట్రం నుండి స్వంతంగా ఎంపీ స్థానాలను గెలవడం కోసం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి బండారు దత్తాత్రేయ విజయం సాధించాడు.ఆ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
undefined
ఆ ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తు ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడ బీజేపీ ఒంటరిగానే పోటీ చేయనుంది.
undefined
ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా ముద్రపడిన కాంగ్రెస్ నేతలకు బీజేపీ వల వేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు బీజేపీ చేరి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం లేకపోలేదు.
undefined
ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జానారెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్టుగా సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాహుల్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మరో వైపు ఆయన తనయుడి గురించి కూడ రాహుల్ ఆరా తీసినట్టుగా చెబుతున్నారు.
undefined
కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని ఎందుకు వీడుతున్నారనే విషయమై సీనియర్ నేతలు పట్టించుకోలేదనే ఆరోపణలు కూడ లేకపోలేదు. సబితా ఇంద్రారెడ్డి పార్టీ వీడుతున్నారనే ప్రచారం సాగిన సమయంలోనే సీనియర్లు ఆమె ఇంటికి వెళ్లి బుజ్జగించారు. కానీ, ఇతర ఎమ్మెల్యేల విషయంలో సీనియర్లు ఎందుకు స్పందించలేదనే చర్చ కూడ లేకపోలేదు.వలసలను ఆపేందుకు ఏం చేయాలి పార్టీ ప్రజా ప్రతినిధుల్లో విశ్వాసాన్ని ఎలా పాదుకొల్పోలనే విషయమై మాత్రం నాయకత్వం చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు గుప్పించారు.
undefined
టీఆర్ఎస్, బీజేపీ నేతల ఆపరేషన్ ఆకర్ష్‌ను తట్టుకొని పార్టీని నిలబెట్టుకొనేందుకు ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కొందరు నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నాడు గాంధీ భవన్ ‌లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
undefined
click me!