కేసీఆర్ దెబ్బకు కాంగ్రెసు వాష్ ఔట్: కారెక్కిన మెజారిటీ ఎమ్మెల్యేలు

First Published Mar 16, 2019, 2:22 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు కానుంది. 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు కానుంది.
undefined
ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరగా, మరికొంత మంది కారెక్కడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వారి సంఖ్య దాదాపు పది ఉంది. శానససభ ఎన్నికల్లో కాంగ్రెసు కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష హోదాకు కనీసం 12 సభ్యులు అవసరం. పది మంది చేజారిపోవడంతో ప్రతిపక్ష హోదాకు ఎసరు వచ్చినట్లే
undefined
రేగా కాంతారావు, ఆత్రం సక్కుతో మొదలైన ఫిరాయింపు కాంగ్రెసు శాసనసభా పక్షాన్ని ఖాళీ చేసేంత వరకు కూడా ఆగేట్లు లేవు. వారి తర్వాత హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. వీరు ముగ్గురు కూడా గిరిజనుల సమస్యలను ముందు పెట్టి, వాటి పరిష్కారం కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ వల్లనే సమస్యలు తీరుతాయని వారు చెప్పారు.
undefined
నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరీ పట్టుబట్టి చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటను కాదనలేని స్థితిలో ఆయనకు కాంగ్రెసు అధిష్టానం టికెట్ ఖరారు చేసింది.
undefined
మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఎన్నికలకు ముందు నుంచే అసంతృప్తితో ఉన్నారు. తన కుమారుడికి రాజేంద్రనగర్ సీటు ఇవ్వకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. అయితే, అప్పటికప్పుడు సర్దుకుని గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.
undefined
సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట తీరు గెలిచినప్పటి నుంచి కాస్తా అనుమానాస్పదంగా కనిపిస్తూ వచ్చింది. కేసీఆర్ ను, కేటీఆర్ ను ప్రశంసిస్తూ వచ్చారు. అయినా తాను టీఆర్ఎస్ లోకి వెళ్లనని చెబుతూనే అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన శనివారంనాడు తన అనుచరులతో సమావేశమయ్యారు
undefined
ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి కూడా రేపో మాపో కారెక్కే అవకాశాలున్నాయి. ఆయన కేటీఆర్ ను కలిశారు. సమస్యల మీద కలిసినట్లు చెబుతూనే టీఆర్ఎస్ లోకి జంప్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
undefined
జాజుల సురేందర్, ఉపేందర్ రెడ్డి కూడా కారెక్కడానికి సిద్ధపడ్డారు. వనమా వెంకటేశ్వర రావు కూడా అదే దారిలో ఉన్నారు. మరింత మంది కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది
undefined
పార్టీ ఫిరాయింపులతో శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాలు ప్రశ్నార్థకంగా మారాయి. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి శాసనసభ్యులు వారికి సహకరించే అవకాశం కూడా లేదు
undefined
click me!