తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు... ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ

First Published Sep 15, 2020, 8:40 PM IST

ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 

హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల జనజీవనం పూర్తిగా స్తంభించింది. పంటలు దెబ్బతిన్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో నాగర్ కర్నూల్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అచ్చంపేట మండలంలో బ్రిడ్జీపైకి వరదనీరు వచ్చింది. దీంతో బ్రిడ్జి కుంగిపోయిం రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
undefined
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు మండలం, నశింపేట వాగు దాటే క్రమంలో గొర్రెలు తరలించే బొలెరో వాహనం కొట్టుకుపోయింది. సంతకు వెళుతున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురిని స్థానికులు కాపాడారు.
undefined
సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెం నుంచి విభాళాపురం వెళ్లే మార్గంలో వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో వెళ్లేవారు.. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని స్థానికులు సూచించారు.సూర్యాపేట శ్రీనివాస కాలనీ, వెంకటేశ్వర కాలనీ, ఇందిరమ్మ కాలనీ, నల్గొండలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది.
undefined
రాత్రి కురిసిన వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వాగులు మత్తడి దుంకుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం, సూరారంలో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. భారీ వర్షానికి కుంట కట్ట తెగి రామన్నపేట నుంచి అమ్మనబోలుకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పంటలు నీటమునిగాయి.
undefined
ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 14 క్రస్టు గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,48,266 క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 2,48,266 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 310.8498 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరింది.
undefined
పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 14 గేట్లను 3 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం డ్యామ్‌లో 44.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,68,099 క్యూసెక్కులు నమోదయింది. అవుట్ ఫ్లో 3,38,840 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 174.30 అడుగుల వరకు ఉంది. మూడు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. విద్యుత్ ఉత్పాదన కోసం 15వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.
undefined
శ్రీరాం సాగర్ బ్యాక్ వాటర్‌లో మునిగిన శివాలయాలునిజామాబాద్: శ్రీరాం సాగర్ బ్యాక్ వాటర్‌లో శివాలయాలు మునిగిపోయాయి. నందిపేట మండలం ఉమ్మెడలోని ఉమా మహేశ్వరాలయం గర్భ గుడితో పాటు ప్రాంగణమంతా జలమయమైంది. దీంతో నెలన్నర వరకు నిత్య పూజలు రద్దు చేయనున్నారు. మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం పెరగడంతో రెంజల్ మండలం కందకుర్తి వద్ద సంగమేశ్వరాలయం సైతం నీట మునిగింది.
undefined
భారీ వర్షాల కారణంగా లోయర్ మానేరు డ్యామ్‌లోకి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు డ్యామ్ తొమ్మిది గేట్లు ఎత్తి వేసి ఇరవై వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరి కాసేపట్లో మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
undefined
click me!