సెప్టెంబర్ ఫస్ట్ వీక్ మాదిరిగానే సెకండ్ వీక్ కూడా లాంగ్ వీకెండే. ప్రతి నెలలో రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆఫీసులకు అధికారిక సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 12న రెండో శనివారమే కాబట్టి తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవుంది. సెప్టెంబర్ 13 ఆదివారం సాధారణ సెలవే.
సెప్టెంబర్ 14 (సోమవారం) కూడా ప్రత్యేక హాలిడే ఉంది. ఈరోజు వినాయక చవితి పండగ ఉంది... కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అధికారిక సెలవుగా ప్రకటించాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడాలేకుండా వినాయక చవితికి వాడవాడనా గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా వేడుకలు జరుపుకుంటారు... ఇళ్లలో కూడా భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అయితే వినాయక ప్రతిష్ఠతో పాటు నిమజ్జన రోజున కూడా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో సెలవు ఉంటుంది.
ఇలా సెప్టెంబర్ 12,13,14 తేదీల్లో (రెండో శనివారం, ఆదివారం, సోమవారం) వరుస సెలవులు రావడంతో వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు కుటుంబంతో కలిసి వినాయక చవితిని వేడుకలను ఘనంగా జరుపుకోవచ్చు.