ఈ నెలలో స్కూళ్లకు ఇంకెన్ని సెలవులు :
తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్రాంతికి విద్యాసంస్థలకు ఐదురోజులే సెలవులు ఇచ్చింది. కానీ రెండో శనివారం, ఆదివారం కలిసిరావడంతో ఏడురోజులు సెలవులు వచ్చాయి. ఇక శనివారం విద్యాసంస్థలు ప్రారంభం కావడంలో ఆరోజు కూడా చాలామంది స్కూల్ కు వెళ్లలేదు. తర్వాత ఆదివారం సెలవురోజు. ఇలా వరుసగా తొమ్మిదిరోజులు సెలవులు తీసుకున్ని విద్యార్థులు నిన్నటి నుండి స్కూళ్లకు వెళుతున్నారు.
ఇక మార్చి, ఏప్రిల్ మొత్తం ఎగ్జామ్స్ సీజన్. ఈ రెండు నెలలు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే. ఇలా చదువు ధ్యాసలో పడి బాగా ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు సెలవు వస్తే కాస్త రిలాక్స్ అవుతారు. అయితే సంక్రాంతి పండక్కి భారీగా సెలవులు వచ్చిన ఈ నెలలోనే మరికొన్ని సెలవులు విద్యాసంస్థలకు వస్తున్నాయి.
జనవరి 26 దేశ గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా నేషనల్ హాలిడే వుంది. కానీ ఇది ఆదివారం వస్తోంది. ఈరోజు ఎలాగూ హాలిడే వుంటుంది...కాబట్టి ఓ సెలవును విద్యార్థలు మిస్సయ్యారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్స్ లో వుండే విద్యార్థులు, పదో తరగతి స్టూడెంట్స్ స్పెషల్ క్లాసుల నుండి కాస్త విరామం లభిస్తుంది.
ఇక సోమవారం ఒక్కరోజు స్కూల్ కి వెళితే మళ్లీ మంగళవారం మైనారిటీ విద్యార్థులకు సెలవు వుంటుంది. జనవరి 28న షబ్-ఏ-మేరాజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు ఐచ్చిక సెలవు ప్రకటించింది. జనవరి నెలలో ఇదే చివరి హాలిడే. ఫిబ్రవరిలో కూడా స్కూళ్లకు చాలా సెలవులు వున్నాయి.