ఐఐటి నుండి అమెజాక్ వరకు ఖురేషి ప్రయాణం :
ఐఐటి పాట్నాలో బిటెక్ పూర్తిచేయగానే అతడికి ప్రముఖ ఐటీ కంపనీ మైక్రోసాప్ట్ లో ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో రెండేళ్లపాటు మైక్రోసాప్ట్ రీసెర్చ్ టీం లో పనిచేసాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఏఐ(Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్ లో ఎంఎస్ పూర్తిచేసాడు. ఇలా గతేడాది 2023 లోనే అతడు ఎంఎస్ పూర్తిచేసాడు.
అయితే తాజాగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అర్బాజ్ ఖురేషి ప్రతిభను గుర్తించింది. అతడు తమకు ఎంతగానో ఉపయోగపడతాడని భావించి భారీ ప్యాకెజీతో ఉద్యోగం ఇచ్చారు. ఏడాదికి రూ.2 కోట్ల భారీ ప్యాకేజీతో ఈ తెలంగాణ కుర్రాడిని ఉద్యోగంలో చేర్చుకుంది ఈ మల్టినేషన్ కంపనీ. ఈ లెక్కన ప్రతి నెలా రూ.16 లక్షలకు పైగానే జీతం అందుకోనున్నాడు అర్బాజ్ ఖురేషి.
తమ కొడుకు భారీ ప్యాకేజీతో అమెజాన్ లో జాబ్ సాధించడంపై తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అర్బాజ్ తండ్రి యాసిన్ ఖురేషి కొడుకు సక్సెస్ ను చూసి మురిసిపోతున్నారు. ఈయన ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జాయింట్ కమీషనర్ గా పనిచేస్తున్నారు.