Holidays : జులైలో తెలుగోళ్ళకు పండగే... నాలుగింటికి నాలుగు వీకెండ్స్ వరుస సెలవులే

Published : Jul 01, 2025, 12:07 PM ISTUpdated : Jul 01, 2025, 01:19 PM IST

జులైలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా వరుస సెలవులు రానున్నాయి. ప్రతి వీకెండ్ లో కేవలం ఆదివారమే కాదు మరిన్ని సెలవులు కలిసివస్తున్నాయి… ఈ నెలలో సెలవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
జులైలో సెలవులే సెలవులు...

School Holidays : జూన్ నెల ముగిసింది... జులైలో అడుగుపెట్టాం. గత నెలలో మొదటి సగం వేసవి సెలవులతో ముగిసింది... మిగతా సగం స్కూళ్లు కొనసాగాయి. తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిసి ఒక్కసారిగా స్కూళ్లు తెరుచుకోవడంతో విద్యార్థులు కాస్త భారంగానే స్కూల్ బాట పట్టారు. జూన్ లో పండగలు, ప్రత్యేక పర్వదినాలేవీ లేకపోవడంతో సెలవులేమీ రాలేవు... దీంతో వేసవి సెలవులు ముగిసాక సండే మినహా మిగతా రోజుల్లో క్రమం తప్పకుండా స్కూళ్ళకి వెళ్లాల్సి వచ్చింది.

ఇలా ఎంతో భారంగా గడిచిన జూన్ ను మరిపించేలా జులైలో విద్యార్థులకు సెలవులు రానున్నాయి. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు కూడా బాగానే సెలవులు రానున్నాయి. ఈ నెలలో ప్రతివారం రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి... కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ప్రతి వారాంతాన్ని లాంగ్ వీకెండ్ గా మార్చుకోవచ్చు. ఇలా జులై లో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వచ్చే సెలవుల గురించి తెలుసుకుందాం.

25
ఈవారం ఓ సెలవు మిస్... అయినా రెండ్రోజులు సెలవులు

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో జులై  ఫస్ట్ వీక్ లో రెండ్రోజులు సెలవులు ఉన్నాయి. అందులో ఒకటి సాధారణ సెలవు కాగా మరొకటి ఆప్షనల్ హాలిడే. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మొహర్రం (పీర్ల పండగ) జులై 6న జరుపుకోనున్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ సెలవు ప్రకటించారు... కానీ ఇది ఆదివారమే వస్తుండటంతో ఆరోజు ఎలాగూ సెలవే. అంటే ఈ నెలలో విద్యార్థులు, ఉద్యోగులకు ఓ సెలవు మిస్ అయ్యిందన్నమాట.

అయితే మొహర్రంతో పాటు ముందురోజు అంటే జులై 5 శనివారం కూడా ఇరురాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు. కానీ ఇది ఆప్షనల్ హాలిడే. ఉద్యోగులు కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు... విద్యాసంస్థలు కూడా అవసరం అనుకుంటేనే సెలవు ప్రటిస్తాయి. కాబట్టి అన్నివిద్యాసంస్థలకు సెలవు ఉండదు... కానీ హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో ఈ మొహర్రంను ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి అక్కడి విద్యాసంస్థలకు ఈ శనివారం సెలవు ఉండే అవకాశాలున్నాయి.

35
జులై 12, 13 సెలవులు

జులై రెండోవారంలో కూడా వరుసగా రెండురోజుల సెలవులు వస్తున్నాయి. జులై 12న రెండవ శనివారం... స్కూళ్లకు సాధారణ సెలవు ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆరోజు సెలవే. ఐటీ, కార్పోరేట్ కంపనీల ఉద్యోగులకు శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలా తెలంగాణ, ఏపీలోని విద్యాసంస్థలతో పాటు ఆఫీసులు జులై 12,13 రెండ్రోజులు పనిచేయవు... విద్యార్థులు, ఉద్యోగులు ఈ సెలవులను ఎంజాయ్ చేయవచ్చు.

45
జులై 20,21 సెలవులు

తెలంగాణలో ఆషాడమాసం బోనాల సందడి ప్రారంభమయ్యింది. జులై నెలంతా బోనాల పండగ జరగనుంది... ప్రతి ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఏదో ఒకచోట బోనాల సందడి ఉంటుంది. అయితే ఆషాడమాసంలో చివరి ఆదివారం అంటే జులై 20న హైదరాబాద్ మొత్తం బోనాల వేడుకలు జరుపుకోనుంది. అలాగే తెలంగాణ పల్లెల్లో కూడా ఈరోజు అమ్మవార్లకు బోనాలు సమర్పించి... మేకలు, కోళ్లు బలిచ్చి వేడుకలు జరుపుకుంటారు.

ఇలా ఆదివారం బోనాల వేడుకల నేపథ్యంలో జులై 21 సోమవారం తెలంగాణలో సెలవు ఉంటుంది. ఇప్పటికే ఈ సెలవును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాబట్టి జులై 20, 21 బోనాల పండగ నేపథ్యంలో సెలవు వస్తోంది.

అయితే కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు శని, ఆదివారం రెండ్రోజులు సాధారణ సెలవు ఉంటుంది... అలాంటివారికి ఈ బోనాల సందర్భంగా సోమవారం వచ్చే సెలవు అదనం. ఇలా వీరికి వరుసగా మూడురోజుల సెలవులు రానున్నారు.

55
జులై 26, 27 సెలవులు

ఈ జులై చివరివారం కూడా కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మరీముఖ్యంగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని స్కూళ్లకు శని, ఆదివారం రెండ్రోజులు సాధారణ సెలవు ఉంటాయి. అలాంటి స్కూల్ విద్యార్థులకు జులై  26,27 సెలవు వస్తోంది.

ఇక బ్యాంక్ ఉద్యోగులకు కూడా ఈ రెండ్రోజులు సెలవే. నెలలో రెండు, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు... కాబట్టి జులై 26న తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక ఎలాగూ జులై  27 ఆదివారం సాధారణ సెలవే. కాబట్టి ఈ రెండ్రోజులు బ్యాంకు ఉద్యోగులకు వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories