రేవంత్‌ రెడ్డి పెళ్లి వెనుక ఇంట్రెస్టింగ్‌ లవ్‌ స్టోరీ.. ప్రేమ పుట్టింది అక్కడే.. గీతా రెడ్డి ఎవరో తెలుసా?

Published : Dec 03, 2023, 03:32 PM ISTUpdated : Dec 05, 2023, 09:09 PM IST

బీఆర్‌ఎస్‌కి గట్టి షాకిస్తూ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించిన రేవంత్‌ రెడ్డి లవ్‌ స్టోరీ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఆయన ప్రేమ వివాహం వెనుక పెద్ద కథే ఉంది.

PREV
16
రేవంత్‌ రెడ్డి పెళ్లి వెనుక ఇంట్రెస్టింగ్‌ లవ్‌ స్టోరీ.. ప్రేమ పుట్టింది అక్కడే.. గీతా రెడ్డి ఎవరో తెలుసా?

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్‌ తిరుగులేని మెజారిటీని సాధించింది. బీఆర్ఎస్‌కి ముంచెమటలు పట్టించేలా చేయడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. ఆయనే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊపు ఆయన వైపే ఉంది. ఎక్కువగా సపోర్ట్ ఆయనకే ఉంది. ఆయన సీఎం అయినా ఆశ్చర్యం లేదు. 
 

26

ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన లవ్‌ స్టోరీ హాట్‌ టాపిక్ అవుతుంది. ఉద్యమ నాయకుడి నుంచి రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన రేవంత్‌ రెడ్డిది ప్రేమ వివాహం కావడం ఇక్కడ ఆసక్తికర అంశం. సినిమా స్టయిల్‌లో ఆయన లవ్‌ స్టోరీ సాగిందనేది బయటకు వచ్చింది. దీంతో రేవంత్‌ రెడ్డి లైఫ్‌ స్టోరీ వెతుకుతుండగా, ఇందులో ఆయన లవ్‌ స్టోరీ బయటపడటంతో అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. 
 

36

ఇక రేవంత్‌ రెడ్డి లవ్‌ స్టోరీ చూస్తే.. ఆయన మొదట స్టూడెంట్‌గా ఉన్న సమయంలో ఏబీవీపీ లీడర్‌గా ఉన్నారు. ఓయూ వంటి వాటిలో పలు కార్యక్రమాలు చేశారు. ఉద్యమాలు నిర్వహించారు. స్టూడెంట్ లీడర్‌గా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. విద్యార్థుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. దీంతో ఆ సమయంలోనే స్టూడెంట్‌గా ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకులు జైపాల్‌ రెడ్డి తమ్ముడు కూతురు గీతా రెడ్డి రేవంత్‌ రెడ్డిపై మనసు పడింది. 
 

46

ఇద్దరు కలిసి స్టూడెంట్‌ లీడర్‌గా ఉన్న సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఈ విషయం జైపాల్‌ రెడ్డి తమ్ముడికి తెలిసింది. దీంతో రేవంత్‌కి తన కూతురుని ఇవ్వడం ఇష్టం లేదు. దీంతో ఢిల్లీలో ఉన్న జైపాల్‌ రెడ్డి వద్దకి కూతురుని పంపించారట. అయినా తగ్గలేదు రేవంత్‌. పొలిటికల్‌గా ఒత్తిడి కూడా వచ్చిందట. కానీ భయపడలేదు. ఏకంగా జైపాల్‌ రెడ్డితోనే రాయబారం ఏర్పర్చుకుని ఆయన్నే ఒప్పించాడట. రేవంత్‌ రెడ్డిలోనూ ధైర్యాన్ని, చురుకుతనాన్ని, టాలెంట్‌ని గమనించి జైపాల్‌ రెడ్డి ఇతను ఎప్పుడైనా మంచి స్థాయికి వెళ్తాడని, నిలబడే శక్తి అతనిలో ఉందని భావించి తమ్ముడినే ఒప్పించాడ. 

56

అలా తన తమ్ముడిని ఒప్పించి, గీతారెడ్డిని రేవంత్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారట. అయితే ఇందులో ఇద్దరిది సేమ్‌ క్యాస్ట్ కావడంతో కూడా జైపాల్‌ రెడ్డి ఓకే చెప్పడానికి మరో కారణమని తెలుస్తుంది. మొత్తానికి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సక్సెస్‌ అయ్యాడు. 
 

66

ఇక పెయింటర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. అట్నుంచి రాజకీయాకల్లోకి వచ్చారు. టీఆర్‌ఎస్‌ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. రాష్ర్ట విభజన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. 2021లో కాంగ్రెస్‌లోకి వచ్చారు. కుక్కలు చించి విస్తారిలా ఉన్న కాంగ్రెస్‌ని ఒక్కతాటికి తీసుకొచ్చి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ఏర్పడేంత వరకు తీసుకొచ్చారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories