Published : Dec 24, 2019, 04:19 PM ISTUpdated : Dec 24, 2019, 04:35 PM IST
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఏకం అవుతున్నారు. ఈ మేరకు క్రిస్‌మస్ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కోరుతున్నారు. ఎఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావుతో సహా పలువురు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు కూడ ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వం వద్ద ప్రస్తావిస్తున్నారు.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఈ పదవి దక్కుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ నేతలు ఒక తాటిపైకి వచ్చినట్టుగా ప్రచారంలో ఉంది.

28
కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతల పేర్లు ఈ పదవికి ప్రధానంగా విన్పిస్తున్నాయి. ఎంపీలుచ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి.

38
కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతల పేర్లు ఈ పదవికి ప్రధానంగా విన్పిస్తున్నాయి. ఎంపీలుచ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు టి. రామ్మోహన్ రెడ్డిలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం ఏర్పాటు చేయడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు.

48
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు ఇతర కీలకమైన నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

58
క్రిస్మస్ పర్వదినం తర్వాత ఈ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అభిప్రాయపడ్డారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల మధ్య ఉన్న అభిప్రాయబేధాలను పరిష్కరించేందుకు ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా గూడురు నారాయణరెడ్డి తెలిపారు.

68
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల మధ్య బేదాభిప్రాయాలను పరిష్కరించకపోతే పార్టీని బలోపేతం చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ సమావేశంలో నేతల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను పరిష్కరించుకొంటామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలకనేత చెప్పారు.కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని కొందరు నేతలు చెప్పారు. పార్టీ కోసం తామంతతా పనిచేస్తున్నామని చెప్పారు. కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నమాట కూడ వాస్తవమేనని ఆయన తెలిపారు.

78
కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కలిసివస్తే తప్పా ఇతర సామాజికవర్గాలు పార్టీతో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు లేవనే అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి.పార్టీలోని ఇతర సామాజికవర్గాలకు చెందిన నేతలు ఐక్యంగా ఉన్నారని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఐక్యంగా లేరని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు అభిప్రాయపడ్డారు.

88
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వకపోతే మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని ఓ పార్టీనాయకుడు పార్టీ నాయకత్వాన్ని కోరారు.మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్ని సామాజికవర్గాలు ఆయనను సమర్ధిస్తారని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.