ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు మరణించినట్లుగా సమాచారం.