హుజూర్‌నగర్ బైపోల్: టీఆర్ఎస్ కు సీపీఐ షాకివ్వడం వెనుక

First Published Oct 15, 2019, 8:05 AM IST

ఈ నెల 21 హుజూర్  నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  గెలుపు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఉపసంహరించుకోవడం వెనుక ఆర్టీసీ సమ్మె ప్రధానంగా కన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు విషయమై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
undefined
కానీ, టీఆర్ఎస్ కు ఆ పార్టీ మద్దతును ఇచ్చింది.ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ అనుసరించిన వైఖరిని నిరసిస్తూ సీపీఐ టీఆర్ఎస్ కు తన మద్దతును ఉపసంహరించుకొంది.
undefined
ఈ నెల 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మద్దతివ్వాలని టీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు సీపీఐను కోరాయి.ఈ నెల 1వ తేదీన నిర్వహించిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గసమావేశంలో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయం తీసుకొంది.
undefined
హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో సీపీఐకు మంచి పట్టుంది.ఆ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. ఈ ఎన్నికల్లో సీపీఐ మద్దతు తీసుకొంటే రాజకీయంగా తమకు కలిసివస్తోందని టీఆర్ఎస్ భావించింది. సీపీఐ కూడ టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటించింది.
undefined
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ జేఎసీలో మూడు ప్రధాన యూనియన్లు ఉన్నాయి. ఆర్టీసీ జేఎసీ కన్వీసర్ గా ఉన్న ఆర్టీసీ యూనియన్ కు గతంలో మంత్రి హరీష్ రావు గౌరవాధ్యక్షుడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పదవికి హరీష్ రావు రాజీనామా చేశాడు.
undefined
ఈ యూనియన్ తో పాటు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటీయూసీకి చెందిన ఎంప్లాయిస్ యూనియన్, సీపీఎంకు అనుబంధంగా ఉన్న ఎస్ డబ్ల్యుఎఫ్ తో పాటు సూపర్ వైజర్ సంఘం, బీఎంఎస్ కు అనుబంధ సంఘంతో పాటు ఇతర సంఘాలు సమ్మె చేస్తున్నాయి.
undefined
ఈ సమ్మెకు సీపీఐ అనుబంధ సంఘం సమ్మెలో ప్రధాన భూమిక పోషిస్తోంది. కార్మికుల పక్షాన పోరాటం చేసే కమ్యూనిష్టు పార్టీలు సమ్మెకు మద్దతుగా నిలిచాయి. అయితే సమ్మెకు మద్దతివ్వాలని ఆర్టీసీ జేఎసీ నేతలు అన్ని రాజకీయ పార్టీలను కోరాయి. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయపార్టీలు సమ్మెకు మద్దతును ప్రకటించాయి.
undefined
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈ నెల 6వ తేదీలోపుగా విదుల్లో జాయిన్ కాకపోవడంతో వారంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఈ ప్రకటన ఆర్టీసీ కార్మికులతో పాటు రాజకీయ పార్టీలకు ఆగ్రహం కల్గించింది.
undefined
కార్మికుల పక్షాన సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది సీపీఐ. సమ్మెను అణచివేస్తున్న అధికార టీఆర్ఎస్ కు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మద్దతివ్వడం సీపీఐపై ప్రత్యర్థులు విమర్శలు చేశారు.
undefined
ఈ పరిణామంతో సీపీఐ రాష్ట్ర నాయకత్వం పునరాలోచనలో పడింది. ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ పునరాలోచన చేయాలని కోరింది. సీఎం నుండి సానుకూలంగా స్పందన రాలేదు. దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతును ఉపసంహరించుకొనేందుకు తాము వెనుకాడబోమని కూడ ఆ పార్టీ ప్రకటించింది.
undefined
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఈ నెల 13వ తేదీలోపుగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కోరారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సానుకూలంగా స్పందించలేదు.
undefined
ఈ నెల 14వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసి ఆర్టీసీ సమ్మెతో పాటు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు విషయమై చర్చించారు.
undefined
ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ కు మద్దతును ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సోమవారం రాత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు.
undefined
రాజకీయంగా తమకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు సీపీఐ ఈ నిర్ణయం తీసుకొంది. మరో వైపు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై కూడ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్టు సీపీఐ ఈ నెల 15 ప్రకటించనుంది.
undefined
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతివ్వడంపై విమ్శరలు వచ్చాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కార్ విధానాలను చూపుతూ సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతును ఉపసంహారించుకొంది. దీంతో తమపై వచ్చిన విమర్శలను ఈ రకంగా సీపీఐ తిప్పికొట్టింది. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఎవరికి మద్దతును ఇస్తోందనే ప్రస్తుతం ప్రధానంగా చర్చ సాగుతోంది.
undefined
click me!