Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ ప్రజలకు కొంత ఊరట కలిగించే వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ వంటి ప్రాంతాల్లో భానుడు తీవ్రంగా మండిపోవడంతో ప్రజలు బయటకు రావడానికే వెనుకంజ వేస్తున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోత తగ్గకపోవడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.
25
వడగాల్పుల ప్రభావం
వడగాల్పులు తీవ్రంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు తాగాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప సూర్యరశ్మికి నేరుగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
35
వాతావరణంలో ఊహించని మార్పులు
ఉపరితల గాలుల మార్పులు, మేఘాల ఏర్పాటుతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి జల్లులు కురిశాయి. ఇదే ధోరణి కొనసాగుతూ వచ్చే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని తెలిపారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.
55
ఉదయం యథావిధిగా ఎండలు
అయితే ఓవైపు వర్షాలు కురుసినా గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎండలు అలాగే కొనసాగుతాయి. అయితే సాయంత్రం సమయంలో జల్లులు పడటం వల్ల చల్లదనం ఏర్పడి ప్రజలకు ఉపశమనం లభించనుంది. మొత్తానికి మండుటెండల మధ్య వర్షాలు కాస్త ఊరటనిచ్చేలా ఉన్నప్పటికీ ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే.