రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

First Published Jun 8, 2023, 2:56 PM IST

రేపు అనుచరులతో మాజీ  ఎంపీ   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  సమావేశం కానున్నారు. పార్టీ  మార్పు విషయమై  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి   స్పష్టత  ఇచ్చే అవకాశం ఉంది.

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఈ నెల  9వ తేదీన  అనుచరులతో ఖమ్మంలో  సమావేశం  కానున్నారు. పార్టీ మార్పుపై  ఈ సమావేశంలో  స్పష్టత ఇవ్వనున్నారు.
 
రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

మండలానికి  ఐదుగురు చొప్పున నేతలకు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం పంపారు.  ఒక్కో నియోజకవర్గానికి   50 నుండి  60 మంది  నేతలను  ఆహ్వానాలు అందాయి.  ఇప్పటికే  ఉమ్మడి ఖమ్మం  జిల్లాలోని  పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆత్మీయ సమ్మేళనాలు  నిర్వహించారు. 

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

ఈ ఏడాది ఏప్రిల్  9వ తేదీన  కొత్తగూడెంలో  నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో   మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు కూడ పాల్గొన్నార.  ఈ సమావేశం ముగిసిన తర్వాత  జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై  బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటేసింది. 

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గాలం వేస్తున్నాయి.  ఈ ఇద్దరు నేతలతో  ఈ రెండు పార్టీల నేతలు  చర్చలు జరిపారు. బీజేపీలో  చేరడానికి  ఈ ఇద్దరు నేతలు అంతగా  ఆసక్తిగా  లేరు.  ఈ విషయాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్  ప్రకటించారు

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

మరో వైపు  కాంగ్రెస్ నేతలు  కూడ  వీరితో  చర్చించారు.  సునీల్ కనుగోల్ ,  రాహుల్ టీమ్  కూడ  ఈ ఇద్దరితో  చర్చించింది. కాంగ్రెస్ లో  చేరేందుకు  ఈ ఇద్దరు నేతలు  కొంత మొగ్గు చూపుతున్నారని సమాచారం.

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు  కార్యకర్తల సమావేశంలో  తాను  రానున్న రోజుల్లో  ఏ పార్టీలో  చేరే విషయాన్ని   పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  ప్రకటించే అవకాశం ఉంది.
 
click me!