తెలంగాణకు వస్తా: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ప్లాన్

Published : Jun 12, 2023, 09:04 PM IST

తెలంగాణలో   వారాహి  యాత్ర  నిర్వహించేందుకు  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  ప్లాన్  చేస్తున్నారు.

PREV
15
తెలంగాణకు వస్తా: పవన్ కళ్యాణ్  వారాహి యాత్రకు ప్లాన్
వారాహి యాత్ర :తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్లాన్

తెలంగాణ రాష్ట్రంలో కూడ  వారాహి  యాత్ర  నిర్వహించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రెండు  రోజుల్లో వారాహి  యాత్ర ప్రారంభం కానుంది. 

25
వారాహి యాత్ర :తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్లాన్

తెలంగాణకు  చెందిన  జనసేన  నేతలు  సోమవారంనాడు   మంగళగిరిలోని   పార్టీ కార్యాలయంలో  సమావేశమయ్యారు.   తెలంగాణలో  పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్  చర్చించారు.  తెలంగాణలో  వారాహి  యాత్ర  ఉంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతలకు చెప్పారు.అయితే  తెలంగాణలో  ఎప్పటినుండి  ఎక్కడి నుండి   యాత్ర ప్రారంభించనున్నారనే  విషయమై  ఇంకా  స్పష్టత  రాలేదు.

35
వారాహి యాత్ర :తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్లాన్

తెలంగాణలో  మరో ఆరు మాసాల్లో  ఎన్నికలు  రానున్నాయి.  జనసేన  బీజేపీ  మధ్య  మైత్రి ఉంది. గతంలో  జీహెచ్ఎంసీ  ఎన్నికల్లో జనసేన  పోటీ  చేయాలని భావించింది.  అయితే  తెలంగాణకు  చెందిన బీజేపీ నేతలు  పవన్ కళ్యాణ్ తో చర్చించారు.  దీంతో  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  జనసేన పోటీ నుండి విరమించుకుంది.  బీజేపీ అభ్యర్ధులకు జనసేన  మద్దతు ప్రకటించింది. 

45
వారాహి యాత్ర :తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్లాన్

ఏపీలో జనసేన, టీడీపీ మధ్య  పొత్తు కుదిరే అవకాశం  ఉంది.  ఈ మేరకు  రెండు  పార్టీల నుండి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి.  ఈ నెల  3వ తేదీన   కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డాతో   టీడీపీ చీఫ్ చంద్రబాబు సమావేశమయ్యారు.. బీజేపీతో పొత్తు విషయమై  చంద్రబాబు చర్చించారనే ప్రచారం  సాగుతుంది. తెలంగాణలో  బీజేపీ, టీడీపీ మధ్య  పొత్తు ఉండే అవకాశం ఉందని సాగుతున్న ప్రచారాన్ని  తెలంగాణ బీజేపీ నేతలు  తోసిపుచ్చారు.  

55
వారాహి యాత్ర :తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్లాన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ  చేస్తామని  పవన్ కళ్యాణ్  గతంలో  ప్రకటించారు. తెలంగాణ ఎన్నికలకు  ఆరు మాసాలే సమయం ఉంది.  ఇప్పటివరకు  పవన్ కళ్యాణ్  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంపై కేంద్రీకరించారు.  ఇవాళ తెలంగాణ నేతలతో భేటీ లో  తెలంగాణపై ఫోకస్  చేయనున్నట్టుగా  పవన్ కళ్యాణ్  ప్రకటించారు.
 

Read more Photos on
click me!

Recommended Stories