కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌తో జూపల్లి కృష్ణారావు భేటీ: కాంగ్రెస్ లో చేరికపై చర్చలు

First Published | Jun 11, 2023, 2:14 PM IST

భువనగిరి  ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో  మాజీ మంత్రి  జూపల్లి కృస్ణారావు ఇవాళ  భేటీ అయ్యారు.  కాంగ్రెస్ లో  జూపల్లి కృష్ణారావు చేరుతారనే ప్రచారం సాగుతుంది. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌తో జూపల్లి కృష్ణారావు భేటీ: కాంగ్రెస్ లో చేరికపై చర్చలు

భువనగిరి  ఎంపీ  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డితో మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  ఆదివారంనాడు  హైద్రాబాద్ లో భేటీ అయ్యారు.  ఈ భేటీలో  మాజీ మంత్రి  శ్రీధర్ బాబు, పాల్గొన్నారు. జూపల్లి కృష్ణారావు,  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలు  కాంగ్రెస్ లో  చేరుతారని  కొంతకాలంగా  ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో  ఈ భేటీకి  ప్రాధాన్యత  నెలకొంది.
 
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌తో జూపల్లి కృష్ణారావు భేటీ: కాంగ్రెస్ లో చేరికపై చర్చలు

ఈ ఏడాది  ఏప్రిల్  10వ తేదీన మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు,  మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలపై  బీఆర్ఎస్ నాయకత్వం  సస్పెన్షన్ వేటేసింది.  దీంతో  ఈ ఇద్దరు నేతలతో  బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు  చర్చలు  జరిపారు.  బీజేపీ కంటే  కాంగ్రెస్ లో  చేరేందుకు   ఈ ఇద్దరు నేతలు  ఆసక్తిని చూపుతున్నారు. కాంగ్రెస్ లో  చేరే విషయమై  చర్చించినట్టుగా  ప్రచారం సాగుతుంది. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌తో జూపల్లి కృష్ణారావు భేటీ: కాంగ్రెస్ లో చేరికపై చర్చలు

రెండు  రోజుల క్రితం  ఖమ్మంలో  మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్  రెడ్డి సమావేశమయ్యారు.  రెండు మూడు  రోజుల్లో  ఏ  పార్టీలో  చేరే విషయమై   స్పష్టత  ఇవ్వనున్నట్టుగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి వచ్చారు.  అయితే   మీడియాను  చూసి  కారును దిగకుండానే ఆయన వెళ్లిపోయారు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌తో జూపల్లి కృష్ణారావు భేటీ: కాంగ్రెస్ లో చేరికపై చర్చలు

2018  ఎన్నికల్లో  కొల్లాపూర్  స్థానం నుండి జూపల్లి  కృష్ణారావు  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ  చేసి  కాంగ్రెస్ అభ్యర్ధి  బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో  ఓటమి పాలయ్యాడు. హర్షవర్ధన్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో  చేరారు.  దీంతో  హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మధ్య  సయోధ్య కుదరలేదు.  ఈ విషయమై  పార్టీ అధినాయకత్వం  చేసిన ప్రయత్నాలు  విఫలమయ్యాయి.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌తో జూపల్లి కృష్ణారావు భేటీ: కాంగ్రెస్ లో చేరికపై చర్చలు

 ఖమ్మంలో  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డితో  కలిసి ఆత్మీయ సమ్మేళనాల్లో  జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.   ఈ సమావేశాల్లో  పాల్గొని   బీఆర్ఎస్ పై  విమర్శలు  చేశారు. దీంతో  బీఆర్ఎస్  నాయకత్వం  జూపల్లి కృష్ణారావు, పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిపై  బీఆర్ఎస్ నాయకత్వం  సస్పెన్షన్ వేటేసింది. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌తో జూపల్లి కృష్ణారావు భేటీ: కాంగ్రెస్ లో చేరికపై చర్చలు

కాంగ్రెస్ పార్టీలో  పనిచేసి ఇతర పార్టీల్లో  చేరిన నేతలను తిరిగి  కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును  ఆహ్వానించినట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌తో జూపల్లి కృష్ణారావు భేటీ: కాంగ్రెస్ లో చేరికపై చర్చలు

మరో వైపు  తన పాత స్నేహితుడైనందున  భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశమైనట్టుగా  మాజీ మంత్రి  జూపల్లి  కృష్ణారావు  చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీ కోసం  పిలిస్తే  వచ్చినట్టుగా  ఆయన   చెప్పారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  మహబూబ్ నగర్ జిల్లాకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి   ఇంచార్జీ మంత్రిగా  ఉన్నారు

Latest Videos

click me!