హైద్రాబాద్‌ పోలీసులకు ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల బురిడీ: కోటిన్నర నగదు డ్రా

First Published Jun 3, 2021, 2:19 PM IST

ఆన్‌లైన్ యాప్ నిర్వాహకులు పోలీసులకు బురిడీ కొట్టించారు. పోలీసులకు తెలియకుండానే ఆన్ లైన్ నిర్వాహకులు పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను డీ ఫ్రీజ్ చేయించి నగదును డ్రా చేశారు. 

ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు సైబర్ క్రైమ్ పోలీసులను బురిడీ కొట్టించారు. పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసి ఇతర బ్యాంకు ఖాతాలకు కోటిన్నర నగదును బదిలీ చేయించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారిగా జెన్నీఫర్ వ్యవహరించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
undefined
ఆన్‌లైన్ లోన్ యాప్ ల కేసుల్లో దేశంలోని 1100 బ్యాంకు ఖాతాలను హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయించారు. అయితే ఈ వ్యవహరంలో కీలకంగా ఉన్నజెన్నీఫర్ బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసి కోటిన్నరను ఇతర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది.
undefined
కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలకు పోలీసులుగా నమ్మించి ఆధారాలను సమర్పించారు. దీంతో పోలీసులు చెప్పారనే నమ్మకంతో బ్యాంకు అధికారులు ఈ ఖాతాను డీఫ్రీజ్ చేసి కోటిన్నర రూపాయాలను ఇతర బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.
undefined
ఇదే తరహాలో గురుగ్రామ్ లోని ఐసీఐసీఐకి లేఖ రాశారు. 39 బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోరారు. అయితే ఈ విషయమై కొరియర్ లో బ్యాంకుకు లేఖ రాశారు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఐసీఐసీఐ హైద్రాబాద్ అధికారులను సంప్రదించారు.
undefined
దీంతో హైద్రాబాద్ ఐసీఐసీఐ అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని తాము కోరలేదని పోలీసులు సమాచారం ఇవ్వడంతో గురుగ్రామ్ బ్యాంకు అధికారులు ఈ ఖాతాలను డీఫ్రీజ్ చేయలేదు.
undefined
ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఫ్రీజ్ చేసిన ఖాతాల నుండి ఏయే బ్యాంకు ఖాతాలకు ఈ నగుదు బదిలీ అయిందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.
undefined
ఆన్ లైన్ లోన్ యాప్ ల ద్వారా భారీ ఎత్తున నగదును చైనాకు తరలించారని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఈ యాప్ వ్యవహరం వెనుక ఉన్న జెన్నీఫర్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
undefined
click me!