తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకే కాదు పేరెంట్స్ కు కూడా దసరా హాలిడేస్ ... ఎన్ని రోజులో తెలిస్తే ఎగిరి గంతేస్తారు

First Published Sep 20, 2024, 5:59 PM IST

వచ్చే నెల అక్టోబర్ లో భారీగా సెలవులు వస్తున్నాయి. తమ పిల్లలతో పాటే ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కూడా ఎక్కువరోజుల సెలవులు తీసుకునే అవకాశం వుంది. ఎలాగో తెలుసా?

Darasa Holiday 2024

Darasa Holiday 2024 : తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకునే పండగ దసరా. ఆడబిడ్డల బతుకమ్మ ఆటాపాటలు,  చిన్నాపెద్ద తేడాలేకుండా కొత్తబట్టలు ధరించి జమ్మి ఆకులు (బంగారం పేరుతో) పంచుకుంటూ అలయ్ బలయ్, రావణ దహనం... ఇలా ఊరూవాడ కలిసి ఎంతో సంబరంగా దసరా పండగను జరుపుకుంటారు. ఈ పండగ తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనది. 
 

Darasa Holiday 2024

ఇలా తెలుగోళ్లు ఎంతో వైభవంగా జరుపుకునే దసరా పండగ కోసం విద్యార్థులకు భారీగా సెలవులు ప్రకటిస్తుంటాయి ఇరు తెలుగు రాష్ట్రాలు. ఈ ఏడాది దసరా వచ్చే నెల అక్టోబర్ 12న వస్తోంది... దీంతో ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. ఇలా వచ్చే నెలంతా సెలవులతో నిండిపోయింది. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా వరుస సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా మల్టి నేషనల్, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు తమ పిల్లలతో పాటే దసరా హాలిడేస్ ను ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులతో పాటు ఉద్యోగుల సెలవుల గురించి తెలుసుకుందాం. 
 

Latest Videos


Darasa Holiday 2024

 తెలంంగాణలో దసరా సెలవులు : 

తెలంగాణలో దసరా చాలా పెద్ద పండగ.  ఆడబిడ్డలు ఎంతో సంబరంగా జరుపుకునే బతుకమ్మ పండగ కూడా ఇదే సమయంలో వుంటుంది. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి పట్టణం,పల్లెపల్లెనా దసరా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇస్తుంది.  

ఈసారి దసరా పండక్కి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏకంగా 13 రోజులు సెలవులు ఇచ్చారు. ఇప్పటికే అక్టోబర్ 2 నుండి 14వ  తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి ఈ సెలవులు వర్తిస్తాయి. 

అయితే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు అక్టోబర్ 1న  కూడా సెలవు ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. అంటే అక్టోబర్ నెలలో సగం రోజులు సెలవులకే పోనున్నాయి. దీంతో ఈ 15 రోజులు విద్యార్థులు ఫుల్ ఎంజాయ్ చేయనున్నారు... ఇప్పటికే హైదరాబాద్ తో పాటు వివిధ పట్టణాల్లో నివాసముండే విద్యార్థులు సొంతూళ్ళకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 

Darasa Holiday 2024

ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు : 

ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి తర్వాత  ఘనంగా జరుపుకునే పండగల్లో దసరా ఒకటి. కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు ఎక్కువగానే సెలవులు ఇస్తుంది. ఇలా ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు 10 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించారు. 

అక్టోబర్ 6న దసరా పండగ కాబట్టి 4వ తేదీ నుండి సెలవులు ప్రారంభం అవుతాయి.   అక్టోబర్ 13 వరకు ఈ సెలవులు కొనసాగుతాయి. అంటే అక్టోబర్ 14 సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి కాబట్టి ఆరోజు పబ్లిక్ హాలిడే. కాబట్టి అక్టోబర్ 3న సెలవు తీసుకుంటే మరో రెండురోజులు కలిసి వస్తాయి... మొత్తం 12 రోజులు దసరా సెలవులు తీసుకున్నట్లు అవుతుంది. 

అయితే దసరా సెలవులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే పైన పేర్కొన్నట్లు అక్టోబర్ 4 నుండి 13 వరకు దసరా సెలవులు. మరి ప్రభుత్వం దసరా సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

Darasa Holiday 2024

అక్టోబర్ నెలంతా సెలవులే సెలవులు : 

అక్టోబర్ నెలలొ మొదటి సగం దసరా సెలవులకే పొతోంది. అక్టోబర్ 2 న గాంధీ జయంతి కూడా ఈ దసరా హాలిడేస్ లో కలిసిపోతోంది. ఇక ఈ నెల చివర్లో మరో హాలిడే వస్తోంది. అక్టోబర్ 31న దీపావళి పండగ... కాబట్టి  ఆరోజు కూడా సెలవు వుంటుంది. 

మొత్తంగా అక్టోబర్ నెలలో విద్యాసంస్థలు సగం రోజులు కూడా నడిచే అవకాశం లేదు. ఇలా భారీ సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు... వారి తల్లిదండ్రులు కూడా ఈ హాలిడేస్ వేళ టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. 
 

Darasa Holiday 2024

పిల్లలకే కాదు పేరెంట్స్ కూ హాలిడేస్ : 

స్కూళ్ళు, కాలేజీలకు దసరా సెలవులపై ఓ క్లారిటీ వచ్చింది. దీంతో పిల్లలతో సరదాగా గడిపేందుకు తల్లిదండ్రులకు చాలా సమయం దొరుకుతుంది. అయితే  పిల్లలకు సెలవులు వచ్చినా ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కు మాత్రం సెలవులుండవు. కాబట్టి వారు తమ పిల్లలతో గడపలేకపోతున్నామని బాధ పడుతుంటారు. అలాంటి పేరెంట్స్ కు కూడా ఈ దసరా సెలవులు కలిసివచ్చాయి. 

ఈ నెల సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 6 వరకు అంటే దాదాపు 9 రోజులు పిల్లలతో పాటే ఉద్యోగాలు చేసే పేరెంట్స్ దసరా సెలవులను ఎంజాయ్ చేయవచ్చు. మరీముఖ్యంగా కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కు పిల్లలతో కలిసి టూర్స్ ప్లాన్ చేసుకునేందుకు ఇది చాలా మంచి సమయం. 

మల్టి నేషనల్, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు శని, ఆది రెండు రోజులు సెలవు వుంటుంది. ఇలాంటివారికి ఈ నెల సెప్టెంబర్ 28,29 రెండురోజులు సెలవే. ఆ   తర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 రెండురోజులు వదిలేస్తే మళ్లీ అక్టోబర్ 2 గాంధీ జయంతి నేషనల్ హాలిడే. ఆ తర్వాత అక్టోబర్ 3, 4 తేదీలు వదిలేస్తే మళ్లీ వీకెండ్ వస్తుంది. అక్టోబర్ 5 శనివారం, ఆక్టోబర్ 6 ఆదివారం కలిసివస్తుంది. మొత్తంగా ఓ నాలుగు రోజులు సెలవు తీసుకుంటే వరుసగా 9 రోజులపాటు పిల్లలతో పాటే దసరా సెలవులు తీసుకోవచ్చు. 
 

click me!