ఇవాళ్టి నుండి వరుస సెలవులు... నాలుగు కాదు మొత్తం ఏడు రోజులు

First Published | Sep 13, 2024, 5:38 PM IST

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సెలవులే సెలవులు. ఇప్పటికే సెప్టెంబర్ 2024లో చాలా సెలవులు రాగా ఇకపై కూడా మరిన్ని సెలవులు రానున్నాయి. ఈ నెలలో సెలవుల వివరాలు... 

School Holiday

Holidays : తెలుగు రాష్ట్రాల్లోని  విద్యాసంస్థలకు సెలవులే సెలవులు వస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. కొన్నిచోట్ల వరుసగా మూడునాలుగు రోజులు సెలవు ఇచ్చారు. ఈ సెలవులు ముగిసాయో లేవో గత శనివారం వినాయక చవితి, ఆ తర్వాత ఆదివారం...వరుసగా రెండ్రోజులు సెలవులు వచ్చాయి. ఈ హాలిడేస్ మూడ్ లో వుండగానే మరో నాలుగు రోజులు వరుస సెలవులు వచ్చాయి.  

ఇవాళ్టి నుండి నాలుగు రోజులపాటు విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు కూడా నాలుగు రోజులు కాకపోయినా రెండుమూడు రోజులైనా సెలవులు వుండనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులకు ఈ నెలలో సెలవులే సెలవులు వచ్చాయి.

సెప్టెంబర్ 14 నుండి సెప్టెంబర్ 17 వరకు సెలవులు ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. అయితే తెలంగాణలో సెప్టెంబర్ 16 హాలిడేపై ఇంకా క్లారిటీ లేదు... ఆ రోజు సెలవును రద్దు చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు నాలుగు రోజులు సెలవును ప్రకటించేసాయి.  

school holiday

వరుస సెలవులు ఎందుకు? ఎప్పటినుండి?  

తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ప్రతినెల రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవులు వుంటాయి. ఇలా సెప్టెంబర్ 14, 2024 అంటే ఇవాళ రెండో శనివారం కాబట్టి సెలవు. ఆ తర్వాత ఆదివారం (సెప్టెంబర్ 15)... ఆరోజు సెలవు కలిసివచ్చింది.  

ఇక సోమవారం (సెప్టెంబర్ 16) ముస్లింల పండగ మిలాద్ ఉన్ నబీ. తమ ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్త పుట్టినరోజున ఈ పండగను జరుపుకుంటారు ముస్లింలు. దీంతో ఈరోజు కూడా సెలవు వుంటుంది. ఈ పండగ ఎప్పుడు జరుపుకుంటారన్నది క్లారిటీ లేదు. కాబట్టి తెలంగాణలో ఈరోజు హాలిడేపై ఇంకా క్లారిటీ లేదు. 

ఇక మంగళవారం (సెప్టెంబర్ 17) వినాయక నిమజ్జనం. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, పల్లెల్లో వినాయక నిమజ్జన అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి ఆరోజు సెలవు వుంటుంది. ఇలా తెలుగురాష్ట్రాల్లో వరుసగా నాలుగురోజులు సెలవులు వచ్చాయి. 

తెలంగాణలో సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబి సెలవును రద్దు చేసారు. నెలవంక దర్శనాన్ని బట్టి పండగ సెప్టెంబర్ 16న జరుగుతుందా లేక సెప్టెంబర్ 17న జరుపుకుంటారా అన్నది తేలనుంది. ఒకవేళ సెప్టెంబర్ 15న నెలవంక కనిపించిందంటే సెప్టెంబర్ 16నే మిలాద్ ఉల్ నబి వుంటుంది.  
 

Latest Videos


School holiday

మరో మూడు హాలిడేస్ : 

వరుసగా నాలుగు రోజుల సెలవు తర్వాత సెప్టెంబర్ 18న అంటే బుధవారం స్కూళ్లు పున్:ప్రారంభం అవుతాయి. నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఆదివారం(సెప్టెంబర్ 22) సెలవు వస్తుంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు ప్రతి శనివారం సెలవు వుంటుంది... అలాంటివాటిలో రెండురోజుల సెలవు. 

ఇక ఈ నెలాఖరులో అంటే సెప్టెంబర్ 28న నాలుగో శనివారం. ఈ రోజు కూడా కొన్ని స్కూళ్లకు సెలవు వుండే అవకాశాలున్నాయి. ఆ తర్వాతి రోజు సెప్టెంబర్ 29న ఆదివారం సహజంగానే సెలవు వుంటుంది. 

ఇలా ఇవాళ్టి నుండి వచ్చే నాలుగురోజుల వరుస హాలిడేస్ మాత్రమే కాకుండా మరో మూడునాలుగు రోజుల సెలవులు ఈ నెలలో రానున్నాయి. ఇప్పటికే సగం నెల అయిపోవచ్చింది... మిగతా సగం నెలలోనే ఏడెనిమిది సెలవులు వస్తున్నాయి. ఈ సెలవు వార్తలు విద్యార్థులను ఖుషీ చేస్తున్నాయి. 
 

School holiday

ఈ నెలలో సెలవుల జాబితా :  

సెప్టెంబర్ 14  : రెండో శనివారం 

సెప్టెంబర్ 15  : ఆదివారం సెలవు 

సెప్టెంబర్ 16 : మిలాద్ ఉన్ నబి 

సెప్టెంబర్ 17  : వినాయక నిమజ్జనం 

సెప్టెంబర్ 22 : ఆదివారం సెలవు 

సెప్టెంబర్ 28  : నాలుగో శనివారం (కొన్ని స్కూళ్లు, బ్యాంకులకు సెలవు) 

సెప్టెంబర్ 29 : ఆదివారం సెలవు 
 

holiday

ప్రభుత్వ,బ్యాంకు ఉద్యోగులకు కూడా సెలవులు : 

తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు, బ్యాంక్ సిబ్బందికి కూడా వరుస సెలవులు వచ్చాయి.  రెండో శనివారం ఎలాగూ బ్యాంకులకు సెలవులు వుంటాయి. ఆది,సోమవారం కూడా వారికి సెలవులే. వినాయక నిమజ్జనం రోజున హైదరాబాద్ లోని బ్యాంకులకు సెలవు వుండే అవకాశం వుంది.

ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవు వుండనుంది. ఆదివారం సహజంగానే సెలవు...సోమవారం మిలాద్ ఉన్ నబి, మంగళవారం వినాయక నిమజ్జన సందర్భంగా సెలవు వుంటుంది. తెలంగాణలో మిలాద్ ఉన్ నబి సెలవును రద్దు చేసారు కాబట్టి సెప్టెంబర్ 15,సెప్టెంబర్ 17న మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు వుంటుంది. 

పిల్లలకు వరుస సెలవులు రావడంతో తల్లిదండ్రులు కూడా లీవ్స్ తీసుకుని సరదాగా బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టీ ఈ వీకెండ్ లో రోడ్లు, టూరిస్ట్ ప్లేస్ లు రద్దీగా వుండనున్నాయి. ఇలా నాలుగురోజుల పాటు పేరెంట్స్ తో హాయిగా గడిపే అవకాశం పిల్లలకు వచ్చింది. 

click me!