కరీంనగర్: ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఇవాళ(మంగళవారం) సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటించారు. హైదరాబాద్ నుండి హుజురాబాద్ కు బయలుదేరిన ఈటల వెంట భారీ కాన్వాయ్ కదిలింది. ఈ క్రమంలో హుజురాబాద్ కు చేరుకున్న ఈటలకు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.