ఆమెకు 45, అతనికి 24... మిస్డ్ కాల్ తో కలిసి, లవ్ లో పడి.. చివరికి మిస్టరీ మరణాలుగా...

First Published | May 31, 2023, 10:03 AM IST

వారిద్దరూ మిస్డ్ కాల్ తో కలిశారు. తనకు పెళ్లై పిల్లలున్న సంగతి ఆమె చెప్పలేదు.. ఆమెకు అంత వయసుంటుందని అతను అనుకోలేదు.. దీంతో 21యేళ్ల గ్యాప్ ఉన్న ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చివరికి.. 

No misహైదరాబాద్ : హైదరాబాద్ శివారులలో కలకలం రేపిన రాజేష్ అనే యువకుడి మృతి కేసు కొలిక్కి వచ్చినట్టే కనబడుతుంది.  అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరులోని డాక్టర్స్ కాలనీ సమీపంలో సోమవారం వరంగల్ కి చెందిన అల్లేవుల రాజేష్ (24) అనే వ్యక్తి  మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో, నగ్నంగా పోలీసులకు దొరికిన సంగతి తెలిసిందే. దీంతో ఒకసారిగా స్థానికంగా తీవ్రస్థాయిలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. 

సుజాత అనే టీచర్ తో అతనికి ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఈ మరణం సంభవించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో చేస్తున్న దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలను గుర్తించినట్లు తెలుస్తోంది. మృతుడి సెల్ఫోన్ కాల్ డేటాలో చివరిసారిగా గవర్నమెంట్ టీచర్ అయిన సుజాతతో మాట్లాడినట్లు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు.  ఆమెకు, మృతుడు రాజేష్ కి ఉన్న సంబంధం మీద ఆరా తీస్తున్నారు. అయితే, సుజాత కూడా  రాజేష్  మృతదేహం వెలుగు చూడడానికి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా తేలింది. 


ఈ రెండు మరణాలకు సంబంధం ఉండడంతో..  ఆమె భర్త, బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజేష్  ములుగు జిల్లా వాసి. ఆరు నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా హైదరాబాదులోని హయత్ నగర్ కు చెందిన గవర్నమెంట్ టీచర్ తో పరిచయం ఏర్పడింది. 

మిస్స్ డ్ కాల్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లుగా మరో కథనం ప్రచారం అవుతుంది. వాట్స్అప్ డీపీలో ఆమె ఫోటో చూసిన రాజేష్.. ఆమెకి ఇంకా వివాహం కాలేదని అనుకున్నాడు. ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి కొంతకాలం సరదాగా తిరిగారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత.. ఆమెకు పెళ్లి అయిన సంగతి తెలియడంతో.. తనను మోసం చేసిందని నిలదీశాడు.

మరోవైపు, వీరిద్దరూ కలిసి తిరుగుతున్న సంగతి ఆమె భర్తకు తెలియడంతో ఇద్దరినీ మందలించాడు. అప్పుడే అతనికి ఆమెకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారన్న సంగతి తెలిసింది. మనస్థాపానికి గురైన రాజేష్.. సుజాతను దూరం పెట్టాడు. అది భరించలేని సుజాత..  తాను చనిపోతాను అంటూ వాట్సప్ మెసేజ్ చేసింది రాజేష్ కి.  కాగా, ఆమె చనిపోతే తాను కూడా చనిపోతానని రాజేష్ అన్నట్లుగా తెలుస్తుంది.

జీవితాంతం కలిసి ఉండలేనప్పుడు కలిసి చనిపోదామని సుజాత టీచర్ రాజేష్ ఇద్దరు అనుకున్నారు. దీంతో మే 24వ తేదీన హయత్ నగర్ లోని ఫర్టిలైజర్ దుకాణంలో పురుగుల మందు కొన్నారు. ఇదంతా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలలో రికార్డు అవ్వడంతో పోలీసులకు  అది దొరికింది. ఆ రోజే ఆ గవర్నమెంట్ టీచర్ తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించింది. ఈ విషయం తెలియని రాజేష్ ఆమెకు వాట్స్అప్ మెసేజ్లు, కాల్స్ చేశాడు. పదేపదే సుజాత ఫోన్ మోగుతుండడంతో కుటుంబ సభ్యులు ఆ కాల్ ని లిఫ్ట్ చేశారు. తాను టీ దుకాణం దగ్గర ఉన్నానని అతను చెప్పడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రాజేష్ ను గట్టిగా మందలించారు. దీంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది.

అదే సమయంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సుజాత మరణించిన విషయం రాజేష్ కి తెలిసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. స్నేహితుడి గదిలో అయితే అతడికి సమస్య అవుతుందని  భావించాడు. దానికోసం శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్మెట్ కు వెళ్ళాడు. మే 24వ తేదీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జన సంచారం ఎక్కువగా లేని శివారు ప్రాంతం కావడంతో మృతదేహాన్ని రెండు మూడు రోజుల వరకు ఎవరూ గుర్తించలేదు.

నాలుగు రోజుల తర్వాత మృతదేహం కుళ్ళిపోవడంతో దుర్వాసనతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే,  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రాజేష్ మృతదేహం నగ్నంగా ఎందుకు ఉంది అని అనుమానం కలిగింది.  ఈ నేపథ్యంలోనే టీచర్ చనిపోయిన తర్వాత ఆగ్రహంతో కుటుంబ సభ్యులు రాజేష్ చనిపోయిన స్థలానికి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. 

కాగా, వీరిద్దరి మధ్య వయసు తారతమ్యం కూడా చాలా ఎక్కువగానే ఉంది.. సుజాతకు 45 ఏళ్లు కాగా.. రాజేష్ కు 24 సంవత్సరాలు.  వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ అక్రమ సంబంధమే ఇద్దరి మృతికి దారితీసిందని  అంటున్నారు. మరోవైపు..  రాజేష్ మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని టీచర్ భర్త చెబుతున్నాడు. అతని మీద తాము దాడి చేయలేదన్నాడు. తన భార్యకు రాజేష్ తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిందొచ్చని..  ఇద్దరి మధ్య చాలా వయసు తేడా ఉందన్నారు. తన భార్యను ఎవరో బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి విషమిచ్చి హత్య చేశారని ఆరోపించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు.

Latest Videos

click me!