జూన్‌లో నా రాజకీయ భవిష్యత్తు వెల్లడిస్తా: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

First Published | May 30, 2023, 2:43 PM IST

వచ్చే ఎన్నికల్లో  బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకొనే లక్ష్యంతో  ముందుకు వెళ్తున్నామని  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  చెప్పారు.

జూన్‌లో నా రాజకీయ భవిష్యత్తు వెల్లడిస్తా: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

 తన భవిష్యత్తు  రాజకీయ  కార్యాచరణను జూన్ మాసంలో వెల్లడించనున్నట్టుగా  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  చెప్పారు. మంగళవారంనాడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  పలు మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూ  ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో  తెలగాణ రాష్ట్రంలో  బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యంగా  ఆయన  పేర్కొన్నారు. ఈ విషయమై  తాము చర్చలు జరుపుతున్నామన్నారు.

జూన్‌లో నా రాజకీయ భవిష్యత్తు వెల్లడిస్తా: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఈ విషయమై  మేథోమథనం జరుగుతుందన్నారు.   మరో  15 రోజుల పాటు  మేథో మథనం జరిగే అవకాశం ఉందన్నారు.  తమ లక్ష్యంలో  ఎలాంటి గందరగోళం లేదన్నారు.  తమ వ్యూహాలు తమకున్నాయని  జూపల్లి కృష్ణారావు  చెప్పారు.  కాంగ్రెస్, బీజేపీలలో  చేరాలని ఆ పార్టీల నుండి ఆహ్వానాలు అందిన విషయాన్ని  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమతో చర్చలు జరిపిన  విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. 

జూన్‌లో నా రాజకీయ భవిష్యత్తు వెల్లడిస్తా: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

brs flagతన దారి ప్రజల దారి అని  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  చెప్పారు.   తెలంగాణ  రాష్ట్ర ఉద్యమం సమయంలో  ఇచ్చిన హామీలను  బీఆర్ఎస్ తుంగలో తొక్కిందని జూపల్లి కృష్ణారావు  ఆరోపించారు.

జూన్‌లో నా రాజకీయ భవిష్యత్తు వెల్లడిస్తా: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

కేసీఆర్ ను దెబ్బకొట్టాలంటే  అందరూ ఏకం కావాల్సిన  అవసరం ఉందని  జూపల్లి కృష్ణారావు   చెప్పారు.ఈ దిశగా  చర్చలు  జరుగుతున్నాయన్నారు. ఏ లక్ష్యం కోసం  తెలంగాణ  రాష్ట్రం సాధించుకున్నామో  ఆ దిశగా  కేసీఆర్ పాలన  సాగడం లేదని  జూపల్లి కృష్ణారావు  చెప్పారు తెలంగాణ ఉద్యమంలో   పాల్గొన్నవారంతా  బాధతో  ఉన్నారని  జూపల్లి  కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

జూన్‌లో నా రాజకీయ భవిష్యత్తు వెల్లడిస్తా: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఏం చేస్తే తెలంగాణకు ప్రయోజనం కలుగుతుందనే విషయమై చర్చిస్తున్నామని  జూపల్లి కృష్ణారావు  చెప్పారు. తమ వ్యూహం  ఫలించేందుకు  ఎలా వ్యవహరించాలనే దానిపై  చర్చిస్తున్నామన్నారు. 

జూన్‌లో నా రాజకీయ భవిష్యత్తు వెల్లడిస్తా: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

నిజాం సర్కార్  కూడా వ్యవహరించని తీరులో  కేసీఆర్  ప్రభుత్వం  వ్యవహరిస్తుందని  జూపల్లి కృష్ణారావు  విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను  అణచివేస్తుందని  కేసీఆర్ సర్కార్ తీరును  జూపల్లి కృష్ణారావు  తప్పుబట్టారు.

Latest Videos

click me!