నాగార్జునసాగర్ బైపోల్: గెలుపు గుర్రం కోసం టీఆర్ఎస్ సర్వే, వ్యూహాత్మక అడుగులు

Published : Jan 01, 2021, 05:55 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయంలో టీఆర్ఎస్  నాయకత్వం కసరత్తు చేస్తోంది. 

PREV
113
నాగార్జునసాగర్ బైపోల్: గెలుపు గుర్రం కోసం టీఆర్ఎస్ సర్వే, వ్యూహాత్మక అడుగులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్  ఎవరిని బరిలోకి దింపుతోందో ఆసక్తి సర్వత్రా నెలకొంది.

213

గత నెలలో టీఆర్ఎస్ కు చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నమర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి  త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

313

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నర్సింహ్మయ్య తనయుడు భగత్ ను బరిలోకి దింపాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. అయితే  నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎంపీ బడుగుల యాదవ్  పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోందని సమాచారం.

413

నర్సింహ్మయ్య బతికున్న కాలంలో పార్టీ నేతల్లో కొందరికి ఆయనకు పొసగలేదు. తను వ్యతిరేక వర్గీయులపై నర్సింహ్మయ్య పార్టీ నుండి సస్పెండ్ చేయించాడు.
 
513

జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి అండతో సస్పెన్షన్ ఎత్తివేయించుకొన్నారు. నర్సింహ్మయ్య వ్యతిరేక వర్గం కూడ టికెట్ కోసం ప్రయత్నం చేస్తోందని ప్రచారం సాగుతోంది.

613

ఈ స్థానం నుండి పోటీ చేయనని శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి జానారెడ్డి కుటుంబం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో సుఖేందర్ రెడ్డి అయితే టీఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

713

తేరా చిన్నప్పరెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో జానారెడ్డిపై పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు.

813

ఈ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి సుమారు 40 వేల  ఓట్లు ఉంటాయి. 1994లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ  చేసిన రామ్మూర్తి యాదవ్ జానారెడ్డిపై విజయం సాధించారు.

913

దీంతో ఈ స్థానం నుండి యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

1013

నల్గొండలో నిర్వహించిన నోముల నర్సింహ్మయ్య సంతాపసభలో యాదవ సామాజికవర్గానికి చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నర్సింహ్మయ్య కుటుంబానికి ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

1113

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్ఎస్ ఈ స్థానంలో కచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. గెలుపు గుర్రాన్నే బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

1213

ఈ స్థానం నుండి జానారెడ్డి పోటీ చేస్తారా.. లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. జానారెడ్డి కుటుంబం నుండి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనుందని సమాచారం.

1313

నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ నాయకత్వం సర్వే నిర్వహించింది.ఈ సర్వే ఆధారంగా ఎవరికి సీటు ఇస్తే ప్రయోజనం ఉంటుందనే విషయమై టీఆర్ఎస్  కసరత్తు చేస్తోంది.

click me!

Recommended Stories