Huzurabad Bypoll: బిగ్ షాక్... టీఆర్ఎస్ లో చేరిన ఈటల బంధువులు, కులస్తులు

Arun Kumar P   | Asianet News
Published : Oct 07, 2021, 03:12 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న సమయంలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు మంత్రి హరీష్ పెద్ద షాకిచ్చారు. 

PREV
16
Huzurabad Bypoll: బిగ్ షాక్... టీఆర్ఎస్ లో చేరిన ఈటల బంధువులు, కులస్తులు

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ నాటికి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఒంటరి చేయాలని అధికార టీఆర్ఎస్ భావిస్తున్నట్లుంది. ఇందుకోసం మొదట ఈటలతో పాటు టీఆర్ఎస్ ను వీడినవారిని, ఆ తర్వాత ఆయన ముఖ్య అనుచరులను తిరిగి పార్టీలోకి లాగారు. ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలోకి దిగిన తర్వాత బిజెపి నాయకులకు గాలం వేసారు. తాజాగా ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో భారీగా వలసలను ప్రోత్సహిస్తోంది. 

26

ఆర్థిక మంత్రి Harish rao రంగంలోకి దిగాక trs లోకి వలసలు మరింత ఊపందుకున్నాయి. చివరకు bjp అభ్యర్థి ఈటల రాజేందర్ బంధువులు, కమలాపూర్ లోని ఆయన ఇంటి చుట్టుపక్కల వారిని, ముదిరాజ్ కులస్తులను కూడా టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. గురువారం మలాపూర్ గ్రామస్తులు, eatala బంధువులు మంత్రి హరీష్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 
 

36

ఈ సందర్భంగా తమ ఆవేదనను వ్యక్తం చేసారు కమలాపూర్ గ్రామస్తులు. ఈటలతో పైరవీలు చేసుకున్నవారు కోట్ల రూపాయలకు పడగలెత్తారని... తనకు సంబంధించిన కొద్దిమంది మాత్రమే ఆయన ఆదరించాడని తెలిపారు. సొంత కులస్తులం,బందువులమైన తమను ఏనాడు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. 

  Huzurabad Bypoll: ప్రచారంలో మంత్రి హరీష్ కు బ్రహ్మరథం... పూలవర్షంతో స్వాగతం (ఫోటోలు)

46

ఈటెల రాజేందర్ సోదరి మత్స్యకారుల సంఘం భవనానికి తాళం వేసిందని మంత్రికి తెలిపారు. అంతేకాకుండా తమ ఇంట్లో పురుషులపై పోలీసు కేసులు పెట్టి ఈటల కుటుంబసభ్యులు వేధించారని హరీష్ రావుకు తెలిపారు గ్రామస్తులు. 
 

56

ఇరుగుపొరుగువారమైన తమనూ ఏనాడు ఆదరించలేదని ఈటల చుట్టుపక్కల ఇళ్లవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల కుటుంబం నివసించే వీధిలోనే తాము నివాసం ఉంటామని... బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వుండికూడా ఏనాడూ తమ బాగోగులు పట్టించుకోలేదని అన్నారు. తమపైనే పోలీసు కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేసారు మహిళలు. తమకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని తెలిపాన గ్రామస్తులు. 
 

66

కమలాపూర్ గ్రామస్తులు చెప్పిందంతా విన్న హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని... మీ అందరికీ తాను ఇకముందు అండగా ఉంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.
 

click me!

Recommended Stories