అమరావతి: టోక్యో ఒలింపిక్స్-2020 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ సింధుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. సోమవారం సింధును కలిసిన మంత్రి పుష్ఫగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అలాగే ఓ జ్ఞాపికను కూడా మంత్రి పువ్వాడ సింధుకు అందించారు. ఈ సందర్భంగా సింధు తల్లిదండ్రులను కూడా మంత్రి పువ్వాడ శాలువాతో సత్కరించారు.