రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వలసల్లో మరింత వేగం పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది.కాంగ్రెస్ ను బలహీనపరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తాము ప్రధాన ప్రత్యర్ధిగా మారే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బరిలో దింపే అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దళిత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని యోచిస్తోంది.