దిశ నిందితుల ఎన్ కౌంటర్ : సిర్పూర్కర్ కమిషన్ కు సుప్రీం మొట్టికాయలు..

First Published Aug 4, 2021, 10:50 AM IST

సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం దీనిమీద మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ సంఘటన తర్వాత.. యుపి ఎన్‌కౌంటర్ హత్యలపై విచారణ ఏర్పాటు చేయబడిందని, ఆ కమిషన్ ఇప్పటికే తన నివేదికను సమర్పించిందని న్యాయవాదికి తెలిపింది. "కమిషన్ 116 మంది సాక్షులను ఎందుకు విచారించాలి? ఏదేమైనా, విచారణను పూర్తి చేయడానికి  చివరి ఆరు నెలల పొడిగింపును మంజూరు చేస్తున్నాం "అని బెంచ్ తెలిపింది.

హైదరాబాద్ : పశువైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో నిందితులను హైదరాబాద్ పోలీసులు డిసెంబర్ 2019 ఎన్‌కౌంటర్లో హత్య చేసిన విషయంపై విచారణను జస్టిస్ సిర్పూర్‌కర్ కమిషన్ పూర్తి చేయలేకపోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసులో విచారణ పూర్తి చేయడానికి మరో ఆరెనెలల గడుపు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ (రిటైర్డ్) విఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని కమిషన్ తరఫున న్యాయవాది కె. పరమేశ్వర్ కోర్టులో మాట్లాడుతూ.. జనవరి 2020 లో ఈ కేసు సుప్రీంకోర్టు రిఫరెన్స్ నిబంధనలను రూపొందించిన తరువాత సిర్పూర్కర్ కమిషన్ కు అప్పగించారని అప్పటినుంచి.. ఈ కేసులో విస్తృతమైన పని జరిగిందని, విచారణను పూర్తి చేయడానికి విచారణ ప్యానెల్‌కు మరో ఆరు నెలల గడువు అవసరమని కోరారు.
undefined
సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం దీనిమీద మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ సంఘటన తర్వాత.. యుపి ఎన్‌కౌంటర్ హత్యలపై విచారణ ఏర్పాటు చేయబడిందని, ఆ కమిషన్ ఇప్పటికే తన నివేదికను సమర్పించిందని న్యాయవాదికి తెలిపింది. "కమిషన్ 116 మంది సాక్షులను ఎందుకు విచారించాలి? ఏదేమైనా, విచారణను పూర్తి చేయడానికి చివరి ఆరు నెలల పొడిగింపును మంజూరు చేస్తున్నాం "అని బెంచ్ తెలిపింది.
undefined
నవంబర్ 28, 2019 న, ఒక యువ పశువైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసి.. ఆమె శరీరాన్ని కాల్చేశారు. ఈ సంఘటన హైదరాబాదుతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో పెద్ద దుమారానికి దారి తీసింది. నేరానికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వెంటనే, వందలాది మంది నిరసనలు చేపట్టారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
undefined
SC 12 డిసెంబర్ 2019 న జస్టిస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో విచారణ కమిషన్ (CoI) ని ఏర్పాటు చేసింది. దాని ఆర్డర్‌లో, "పరిస్థితులను విచారించడానికి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము. నలుగురు నిందితులు, మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్ డిసెంబర్ 6, 2019 న హైదరాబాద్‌లో హత్య చేయబడ్డారు. కమిషన్ లోని ఇతర సభ్యులు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ పి RP సొందుర్బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డిఆర్ కార్తికేయన్ లను నియమించింది. వీరికి వేతనాలను కూడా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ప్రతీ సిట్టింగ్ కు జస్టిస్ సిర్పూర్‌కర్ కు రూ .1.5 లక్షలు, ఇతర సభ్యులకు రూ.లక్షగా నిర్ణయించింది.
undefined
మరోవైపు గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అతని ఐదుగురు సహచరుల హత్యలు, ఎనిమిది మంది పోలీసుల హత్యలపై విచారణ జరిపేందుకు జస్టిస్ (రిటైర్డ్) బిఎస్ చౌహాన్ నేతృత్వంలో నిరుడు జూలై 22 న అలహాబాద్ మాజీ హైకోర్టు జడ్జి శశి కాంత్ అగర్వాల్, యుపి మాజీ డిజిపి కెఎల్ గుప్తాతో విచారణ కమిషన్‌ను ఎస్‌సి ఏర్పాటు చేసింది. ఎన్‌కౌంటర్లు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో జరిగినందున, జస్టిస్ చౌహాన్ కమిషన్ అన్ని ప్రదేశాలను సందర్శించి సాక్షులను కలవాల్సి ఉంది. కరోనాతో పాటు ఇతర అడ్డంకులు ఉన్నప్పటికీ, కమిషన్ తన నివేదికను ఎనిమిది నెలల్లో (ఈ సంవత్సరం ఏప్రిల్‌లో) సుప్రీంకోర్టు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది.
undefined
దీనికి విరుద్ధంగా, జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ కు గత సంవత్సరం జూలై 24 న మొదటి ఆరు నెలల పొడిగింపు, ఈ సంవత్సరం జనవరి 29న మరో ఆరు నెలల పొడిగింపును మంజూరు చేసింది. కమిషన్ మంగళవారం మంజూరు చేసిన ఆరు నెలల పొడిగింపు మొత్తాన్ని ఉపయోగించుకుంటే, ఎస్సీ తనకు కేటాయించిన విచారణను పూర్తి చేయడానికి రెండేళ్లు పూర్తవుతుంది.
undefined
click me!