ఈటెల ఏనాడు బిసిల కోసం ముఖ్యమంత్రిని అడగలేదు... మంత్రి గంగుల కమలాకర్

First Published Jul 22, 2021, 5:39 PM IST

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏనాడు కేసీఆర్ని బిసిల గురించి అడగకుండా ఇక్కడి బిసిలకు ద్రోహం చేసారని మండిపడ్డారు. అడగనిదే అవ్వైనా అన్నం పెట్టదని అలాంటిది స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విజ్ణప్తి చేసినా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి ద్రుష్టికి ఏనాడు ఈటెల బిసిల సమస్యలను తీసుకెళ్లలేదని ద్వజమెత్తారు. 

హుజురాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బిసిలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా కులసంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించామని, కొన్ని చోట్ల నిర్మిణాలు కొనసాగుతున్నాయని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో బతుకుతున్నామన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
undefined
గురువారం హుజురాబాద్లో కుల సంఘాల ఆధ్వర్యంలో సిటి సెంటర్ హాళ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులు మారినా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం సంకల్పించని ఆత్మగౌరవ భవన నిర్మాణాల కార్యక్రమాలాకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిందని, అయితే దురద్రుష్టవశాత్తు ఇక్కడి స్థానిక మాజీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏనాడు కేసీఆర్ని బిసిల గురించి అడగకుండా ఇక్కడి బిసిలకు ద్రోహం చేసారని మండిపడ్డారు.
undefined
అడగనిదే అవ్వైనా అన్నం పెట్టదని అలాంటిది స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విజ్ణప్తి చేసినా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి ద్రుష్టికి ఏనాడు ఈటెల బిసిల సమస్యలను తీసుకెళ్లలేదని ద్వజమెత్తారు
undefined
ఏదైనా మీటింగ్ పెట్టుకోవడానికి వెనుకబడిన కులాలు ఇబ్బందులు పడుతూ పంక్షన్ హాళ్లలో, హోటల్లలో నిర్వహించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తాజాగా కులసంఘాల నేతలు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే తొలివిడతగా మున్నూరు కాపు, రజక సంఘాలకు భూమిని కేటాయించడమే కాకుండా ఈ రోజు వాటి పత్రాలను సంఘాలకు అందించారు మంత్రి గంగుల.
undefined
మనం ఇరవై గుంటలు అడుగుతే, కడుపునిండా పెట్టే ముఖ్యమంత్రిగారు ఎకరం భూమి ఇవ్వడమే కాకుండా, ఒక్కో భవనానికి 50 లక్షల నిధుల్ని తొలివిడతగా అందించారన్నారు. కరీంనగర్లో స్థానికంగా కులసంఘాలకు భవనాలు కావాలని ముఖ్యమంత్రిగారికి చెప్పి సాధించుకున్నామని, రాష్ట్ర రాజదానిలో అత్యంత విలువైన కోకాపేట లాంటి ప్రాంతాల్లో40 బిసి కులాలకు అత్యధ్బుతమైన భవనాలు నిర్మించుకొంటూ ఆత్మగౌరవాన్ని పెంచుకున్నామని, ఈటెల నిర్లక్ష్యంతో వెనుకబడిన హుజురాబాద్లో ప్రతీ పనిని పూర్తి చేసే భాద్యతను తీసుకుంటామన్నారు గంగుల.
undefined
మొదటి విడతగా నిధుల్ని అందించడంతో పాటు మలి విడత నిధుల్ని కూడా తీసుకొస్తానన్నారు. ఇంతలా మన సంక్షేమాన్ని చూస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎలక్షన్లలో సంక్షేమం, అభివ్రుద్ది కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
undefined
ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే సుంకేరవిశంకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య ,ఎగ్గే మల్లేశం, మేయర్ వై.సునీల్రావు ,డిప్యూటీమేయర్ చల్ల స్వరూపరాణి- హరిశంకర్లు, బిసి సంఘాల నేతలు హాజరయ్యారు.
undefined
click me!