వరదల్లో మీ స్టడీ సర్టిపికేట్స్, ఆస్తి పత్రాలు కొట్టుకుపోయాయా? వెంటనే ఇలా చేయండి

First Published Sep 10, 2024, 9:30 PM IST

ఇటీవల సంభవించిన వరదల్లో విలువైన స్టడీ, ఆస్తి పత్రాలను కోల్పోయారా? అయితే వెంటనే మీరు ఏం చేయాలంటే.. 

floods

Floods : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సం సృష్టించాయి. ఈ వర్షాల దాటికి నదులు, వాగలు వంకలు ప్రమాదకరంగా ప్రవహించాయి... జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఇలా తెలంగాణలో మున్నేరు, ఆంధ్ర ప్రదేశ్ లో బుడమేరు వరదనీటితో ఉగ్రరూపం దాల్చింది జనావాసాలపై విరుచుకుపడ్డాయి. దీంతో ఖమ్మం, విజయవాడ నగరాలు నీటమునిగాయి.  

వరదనీరు ఇంటిని చుట్టుముట్టడంతో చాలామంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇలా కట్టుబట్టలతోనే బయటకువచ్చిన   బాధితలు వరద ప్రవాహం తగ్గడంలో ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం బురదమయమైన ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులే కాదు ఇంట్లోని ఫర్నీచర్, ఇతర వస్తులు పనికిరాకుండా పోయాయి. ఇంటి పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి.  

Floods

కొందరు వరద బాధితుల పరిస్థితి మరీ దారుణం. ఇళ్లలోని సరుకులు, ఫర్నీచర్, ఇతర వస్తువులే కాదు విలువైన స్టడీ సర్టిఫికేట్స్, ఆస్తులు, భూములకు సంబంధించిన విలువైన పత్రాలు కూడా కొట్టుకుపోయాయి. కుటుంబసభ్యులు ఆధార్, రేషన్ కార్డులు వంటివి కూడా వరదపాలయ్యాయి. ఇలా విలువైన పత్రాలు తడిసి పాడయిపోవడం, వరదనీటిలో కొట్టుకుపోవడంతో చాలామంది బాధితులకు ఏం చేయాలో అర్థంకావడం లేదు. ఇలాంటివారి బాధను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

విద్యార్హతలకు సంబంధించిన పత్రాలే కాదు ఆస్తులు, భూములకు సంబంధించిన పత్రాలను వరదల్లో కోల్పోయినవారు వెంటనే స్థానిక పోలీసులకు సంప్రదించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. వీరికోసం పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏయే పత్రాలు పోయాయో తెలుపుతూ ఓ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించిన డూప్లికేట్ పత్రాలను అందిస్తామని ప్రకటించారు. ఇలా వరద బాధితులను ఆందోళన చెందవద్దంటూ రేవంత్ సర్కార్ భరోసా ఇచ్చింది. 

Latest Videos


Floods

వరద బాధితులకు ప్రభుత్వ సాయం :
 
తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు తగ్గాయి...  దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనావేసే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే   రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ శాంతికుమారితో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి వరద నష్టంపై చర్చించారు. తిరిగి సాధారణ పరిస్థితులకు కల్పించేందుకు ఎన్ని నిధులు అవసరమో చర్చించారు. 

ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తోందన్నారు మంత్రి పొంగులేటి. యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సహాయమందిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది ... ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చివరి బాధితుని వరకు సహాయం అందిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. 

వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు అందజేయనున్నట్లు తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 33మంది మరణించారని...వీరిలో  ఖమ్మంలో 6, కొత్తగూడెంలో 5, ములుగులో 4, కామారెడ్డిలో 3, వనపర్తిలో 3 మంది ఉన్నారని తెలిపారు. వీరి కుటుంబాలకు వెంటనే ఆదుకోవాలని... సాయం అందించే ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. 

ఇక భారీ వర్షాలు, వరదల దాటికి వేలాది ఇండ్లు కూలిపోయాయి... చాలా కుటుంబాలు నిరాశ్రయులు అయ్యాయి. వీరికి కూడా ప్రభుత్వం సాయం అందిస్తుందని మంత్రి ప్రకటించారు. కూలిన ఇళ్లను వెంటనే గుర్తించి బాధితులకు రూ.5 లక్షల రూపాయలతో ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మంత్రి పొంగులేటి సూచించారు.
 

Floods

ప్రతి కుటుంబానికి రూ.16,500:

వర్షాలలో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.16,500 చొప్పున సహాయం అందించనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద సహాయం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే బాధితుల అక్కౌంట్లోకి జమ చేస్తున్నామని వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజల బాధను ప్రత్యక్షంగా చూసారన్నారు. చలించిపోయిన ఆయన ప్రతి బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారని మంత్రి గుర్తుచేసారు. 

అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవతా ధృక్పథంతో నిర్ణయం తీసుకున్నామని...  బాధిత కుటుంబానికి అందించే ఆర్థిక సాయాన్ని  రూ.16,500 కి పెంచినట్టు వెల్లడించారు. ఈ సహాయాన్ని ఇప్పటినుండే బాధితులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 

Floods

ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం:

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షలాది  ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి రూ.పదివేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 

దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముప్పుకు గురికాగా, దాదాపు 2 లక్షల మంది ప్రభావితం అయినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందస్తు చర్యల వల్ల 2,454 మందిని రక్షించామని తెలిపారు. 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు.తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి గింజను కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

click me!