HYDRA: రేవంత్ ఎక్కడ కెలక్కూడదో అక్కడే కెలికేశాడు!

First Published Sep 10, 2024, 7:17 PM IST

హైడ్రా... రేవంత్ సర్కార్ కు ప్లస్సా? మైనస్సా? కాంగ్రెస్ పార్టీని ముంచుతుందా? మరోసారి గెలుపు దిశగా నడిపిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ 10 పాయింట్స్.

HYDRA

HYDRA (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency) : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 'హైడ్రా' పేరు వింటేనే రియల్టర్లు  బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో చెరువులు, కాలువలు, ప్రభుత్వ స్థలాలును కబ్జా చేసిన వారయితే ఎప్పుడు, ఎక్కడినుండి హైడ్రా బుల్డోజర్లు వస్తాయోనని భయపడిపోతున్నారు. బడాబాబుల నుండి బడుగుజీవుల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు... నిర్మాణం అక్రమమా? సక్రమమా? అన్నదే ముఖ్యం.  అక్రమం అని తేలితే ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. దీంతో హైడ్రా పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోపోతోంది. 

సినీనటుడు, ప్రస్తుత బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత 'హైడ్రా' పేరు సంచలనంగా మారింది. సీనియర్ ఐపిఎస్   అధికారి ఏవి రంగనాథ్ ను హైడ్రా కమీషనర్ గా నియమించింది రేవంత్ సర్కార్. ఆయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా నగరంలోని చెరువులను కాపాడేపనిలో పడ్డారు.

హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ కోసం సిన్సియర్ గా పనిచేస్తున్న హైడ్రాకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. కొందరు నాయకులు ఇది కాంగ్రెస్ ఆడుతున్న హైడ్రామా అంటున్నా... ప్రజలు మాత్రం హైడ్రాకు మద్దతుగా వున్నారు. హైడ్రా బాధితులు మినహా ప్రజలంతా హైడ్రావైపే నిలుస్తున్నారు.  

అయితే హైడ్రా వల్ల రేవంత్ సర్కార్ కు లాభంతో పాటు నష్టాలు కూడా వున్నాయి.  ముఖ్యంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా ప్రభావం కనిపిస్తోంది. కూల్చివేతలు ఇలాగే కొనసాగితే రియల్టర్ల సపోర్ట్ ను కాంగ్రెస్ పూర్తిగా కోల్పోతుంది. ఇదే సమయం ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాదు పర్యావరణాన్ని కాపాడేలా హైడ్రా చేస్తున్న పనులతో కాంగ్రెస్ కు ప్రజా మద్దతు లభిస్తుంది. ఇలా హైడ్రా రేవంత్ సర్కార్ కు కొంత తీపి,మరికొంత చేదు అనుభవాన్ని ఇస్తోంది. 

Revanth Reddy

హైడ్రా వల్ల లాభాలు : 

హైడ్రా చెరువులను కబ్జా నుండి కాపాడుతుంది. అంటే చెరువులను మునుపటిలా పునరుద్దరించకపోవచ్చు కానీ ఇకపై అక్రమాలు జరక్కుండా అడ్డుకుంటుంది. దీనివల్ల అనేక అనేకలాభాలు వున్నాయి. 

1.  వర్షాకాలంలో హైదరాబాద్ నగరంలోని రోడ్లు చెరువుల్లా మారిపోతున్న విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి భారీగా నీరుచేరుతుంది... ఇక భారీ వర్షం కురిసిందో అంతే సంగతి. లోతట్టు ప్రాంతాలు, చెరువుల చుట్టుపక్కల ప్రాంతాలు జలమయం అయిపోతాయి. ఇందుకు కారణం వర్షపు నీరు చేరే చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు. రోజురోజుకు చెరువులు, నాలాలు కుచించుకుపోవడంతో వర్షపు నీరు రోడ్లపైకి వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే హైదరాబాద్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. హైడ్రా వల్ల పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం వుంది. 

2. సాధారణ చెరువులు, నాలాలే కాదు ఒకప్పుడు నగరానికి మంచినీరు అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి జలాశయాలు కూడా కబ్జాకు గురవుతున్నాయి. వీటిచుట్టూ బడాబాబులు ఫార్మ్ హౌస్ లు వెలిసాయి. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా జలాశయాల్లోని నీరు కూడా తీవ్రంగా కాలుష్యం అవుతోంది. తాజాగా హైడ్రా చర్యలతో పరిస్థితి మారే అవకాశాలున్నాయి. 

Latest Videos


Telangana Cngress

3. కేవలం చెరువులే కాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడ కబ్జాకు గురయినా చర్యలు తీసుకునే అధికారం హైడ్రాకు వుంది. అంటే ప్రభుత్వ ఆస్తులు హైడ్రా చర్యల కారణంగా కబ్జాల బారిన పడకుండా వుంటాయి. దీంతో హైదరాబాద్ లో కోట్ల విలువైన స్థలాలు, భూములకు రక్షణ లభిస్తుంది. 

4. పొలిటికల్ గా కూడా కాంగ్రెస్ పార్టీకి హైడ్రాతో మంచి మైలేజ్ వచ్చింది. ప్రజల్లో రేవంత్ సర్కార్ చేస్తున్నది మంచిపనే అన్న అభిప్రాయం ఏర్పడింది. పెద్దలు, పేదలు అనే తేడాలేకుండా నగరాన్ని పరిరక్షించేందుకే రేవంత్ సర్కార్ ఏర్పాటుచేసిన హైడ్రా పనిచేస్తోందనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 

5.  ఈ హైడ్రాను ఉపయోగించి గత బిఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను భయటపెట్టే ప్రయత్నంచేస్తోంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ జన్వాడ ఫార్మ్ హౌస్ అక్రమం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. అలాగే మరికొందరు బిఆర్ఎస్ నాయకులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని బయటపెట్టారు. ఇలా హైడ్రా కాంగ్రెస్ కు రాజకీయ లబ్దిని కూడా చేకూరుస్తోంది. 
 

Hydra

హైడ్రా వల్ల నష్టాలు : 

రేవంత్ సర్కార్ ఏర్పాటుచేసిన హైడ్రాతో లాభాలే కాదు నష్టాలు కూడా వున్నాయి. హైడ్రా ఏర్పాటుతో రేవంత్ పులిమీద స్వారీ ప్రారంభించారని ...దీన్ని కొనసాగించినంతకాలం ఆయన బావుంటారు.. ఒక్కసారి వెనక్కితగ్గితే ఆయన పని అయిపోయినట్లేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. హైడ్రాతో రేవంత్ పతనాన్ని కొనితెచ్చుకున్నారనేవారు కూడా వున్నారు. 

1. హైడ్రా ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు. ఇతర పార్టీల నాయకులే కాదు కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలను కూడా వదిలిపెట్టడం లేదు. అలాగే బాధితులకు మద్దతుగా నిలిచి కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టడంలేదు. ఇలా ఇప్పటికే దానం నాగేందర్ లాంటి వారిపై కేసులు నమోదయ్యాయి. ఇలాగే కొనసాగితే సొంత పార్టీలోనే రేవంత్ పై అసమ్మతి పెరిగిపోతుంది. 

2. ఇక హైడ్రా చర్యలతో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. గతంతో పోలిస్తే నగరంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత జూలైతో పోలిస్తే ఆగస్ట్ లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం భారీగా తగ్గింది. ఇలా హైడ్రా ప్రభావంతో రేవంత్ సర్కార్ ఆదాయానికి గండి పడుతోంది. 
 

Hydra

3. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ దెబ్బతినే అవకాశం వుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం వుందని... దీంతో వారు తమ వ్యాపారాలను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రమాదం వుందని అంటున్నారు. 

4. తెలిసో తెలియకో పెద్దవాళ్ళే కాదు పేదవాళ్లు కూడా చెరువులు, ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చివేతలు చేపడుతుంటే ధనవంతులు వెళ్ళిపోతారు...పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ పేదవాళ్లు అలా కాదు... ఎంతో కష్టపడి కట్టుకున్న నివాసాలను కూల్చివేయించిన ప్రభుత్వంపై, పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతారు. ఇది కాంగ్రెస్ కు నష్టం చేకూర్చవచ్చు.

5. కాంగ్రెస్ పార్టీలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వున్నారు. ఇలాంటివారు ఇప్పటికే హైడ్రా చర్యలను తప్పుబడుతున్నారు. వీరంతా ఒక్కటై రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. 
 

click me!