తెలంగాణలో రోజూ ఆర్టీసీకి రూ. 2 కోట్లు: డీజీల్‌ ఖర్చులకు కూడ చాలడం లేదు

First Published | May 27, 2020, 4:37 PM IST

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా కూడ  అంతంత మాత్రంగానే ఆదాయం వస్తోంది. ఆర్టీసీ బస్సుల ద్వారా ఆదాయం డీజీల్ ఖర్చులకు కూడ చాలడం లేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

:తెలంగాణలో ఆర్టీసీ బస్సుల ద్వారా అంతంత మాత్రమే ఆదాయం వస్తోంది. టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం డీజీల్ ఖర్చులకు కూడ సరిపోవడం లేదు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ నష్టాలు గోరుచుట్టుపై రోకలిపోటు మాదిరిగా మారాయి.
undefined
లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇవ్వడంతో తెలంగాణలో ఈ నెల 19వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసీ సుమారు 59 రోజుల తర్వాత తెలంగాణలో రోడ్డు ఎక్కాయి.
undefined

Latest Videos


ఈ నెల 19వ తేదీన 2900 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రయాణీకులను బట్టి బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 20వ తేదీ నుండి మరో వెయ్యి బస్సులను ప్రారంభించింది ఆర్టీసీ యాజమాన్యం.
undefined
ప్రస్తుతం రోజుకు 3800 ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడుతుపోంది. ఈ నెల 19వ తేదీన 63 లక్షల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రోజు నుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. ప్రతి రోజూ సగటున రూ. 2 కోట్లు ఆదాయం వస్తోంది.
undefined
లాక్‌డౌన్‌కు ముందు ప్రతి రోజూ ఆర్టీసీకి రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేది. అయితే ప్రతి రోజూ రూ. 2 కోట్ల కంటే ఆదాయం రావడం లేదు. ఇప్పటివరకు ఆర్టీసీకి సుమారు రూ. 15 కోట్లు ఆదాయం వచ్చింది.
undefined
ప్రతి రోజూ వచ్చే రూ. 2 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ బస్సులకు ఉపయోగించే డీజీల్ ఖర్చులకు కూడ ఈ ఆదాయం సరిపోవడం లేదని యాజమాన్యం చెబుతుంది. కనీసం రోజుకు రూ. 5 కోట్లు వస్తే తమకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
undefined
నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి గత ఏడాది 55 రోజులకు పైగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నష్టాల్లోకి నెట్టిందని ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్ నేపథ్యంలో 59 రోజుల పాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆర్టీసీ నష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
undefined
ప్రస్తుతం బస్సులు నడుపుతున్న ప్రయోజనం దక్కని పరిస్థితి నెలకొంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కరోనా నేపథ్యంలో బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా సగం మంది ప్రయాణీకులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇది కూడ ఆర్టీసీకి ఆదాయం తక్కువ రావడానికి కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
undefined
మరో వైపు హైద్రాబాద్ లో సీటీ బస్సు సర్వీసులు నడపడం లేదు. సిటీ బస్సు సర్వీసులతో ఆర్టీసీకి పెద్దగా ఆదాయం లేదు. సిటీ సర్వీసులతో ఆర్టీసీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
undefined
click me!