విద్యార్ధుల మధ్య ఆరడుగుల దూరం: టెన్త్ పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ సర్కార్ జాగ్రత్తలు

First Published | May 22, 2020, 6:07 PM IST

ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం టెన్త్ పరీక్షల షెడ్యూల్ ను శుక్రవారం నాడు విడుదల చేసింది. జూన్ 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 

టెన్త్ పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జూన్ 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
undefined
ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి విద్యార్ధి మద్య ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు.
undefined

Latest Videos


ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు సంబంధించి 2535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షా కేంద్రాలతో మరో 2005 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
undefined
ఈ పరీక్షలకు 5.34 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు మాస్కులు అందించనుంది ప్రభుత్వం. మరో వైపు శానిటైజర్లను కూడ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
undefined
పరీక్ష హాల్స్ ను పరీక్ష జరిగిన వెంటనే క్లీన్ చేయనున్నట్టు గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని కూడ అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు.
undefined
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్నారు. కంటైన్మెంట్ జోన్ల నుండి విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారికి ప్రత్యేక రూమ్ లో పరీక్ష రాయించనున్నారు.
undefined
click me!