కేటీఆర్‌కు సీఎం పదవి: బీజేపీకి చెక్, టీఆర్ఎస్ వ్యూహామిదేనా?

First Published Jan 21, 2021, 2:26 PM IST

తెలంగాణ సీఎంగా కేటీఆర్ త్వరలోనే అవుతారని ఆ పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగైదు రోజులుగా టీఆర్ఎస్ నేతలు ఈ వ్యాఖ్యల జోరును మరింత పెంచారు. 

తెలంగాణ సీఎంగా కేటీఆర్ అవుతారని పార్టీ నేతలు వరుసగా పోటీలు పడి ప్రకటనలు చేయడం టీఆర్ఎస్ వ్యవహారాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ విషయంలో నేతల ప్రకటన వెనుక టీఆర్ఎస్ లో తెర వెనుక ఏదో జరుగుతుందనే చర్చ లేకపోలేదు.
undefined
తెలంగాణ సీఎం గా కేటీఆర్ త్వరలో అవుతారని... సీఎం అయ్యే అర్హతలు కేటీఆర్ కు ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు పోటీలు పడి చెబుతున్నారు.
undefined
గత కొంత కాలంగా టీఆర్ఎస్ నేతలు ఈ విషయమై బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ సీఎం అవుతారని చెబుతున్నారు.
undefined
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు కూడ టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసినట్టుగా కన్పిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ కు షాకిచ్చింది. త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరగనున్నాయి.
undefined
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితులు టీఆర్ఎస్ పై ఉన్నాయి.
undefined
2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు గాను కేటీఆర్ ను సీఎం చేయాలనే యోచన చేస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు.
undefined
సీఎం కేసీఆర్ ఎక్కువగా ఇటీవల కాలంలో ఫామ్ హౌస్ కే పరిమితమౌతున్నారు. పార్టీ నేతలతో ఎక్కువగా సమయం కేటాయించడం లేదనే చర్చ కూడ లేకపోలేదు.పార్టీ నేతలతో సమావేశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ నిర్వహిస్తున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడ ఆయన తరచుగా సమావేశమౌతున్నారు.
undefined
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు కేసీఆర్ పగ్గాలు అప్పగించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ కు సీఎంగా పదవిని అప్పగిస్తే రాజకీయంగా టీఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశాలు లేకపోలేదనే కొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
undefined
బీజేపీ దూకుడును కట్టడి చేసేందుకు అంతే దూకుడుతో వ్యవహరించాల్సిన అనివార్య పరిస్థితులు కూడ ఉన్నాయని ఈ దూకుడు కలిగిన కేటీఆర్ కు సీఎం పదవిని కట్టబెడితే ప్రయోజనం ఉంటుందనే వాదించే వారు కూడ లేకపోలేదు.ఇది కూడ కేటీఆర్ ను సీఎం చేస్తే ప్రయోజనం ఉంటుందని వాదించేవారు కూడ లేకపోలేదు.
undefined
ఇప్పుడు కేటీఆర్ ను సీఎం చేయకపోతే భవిష్యత్తులో ఆయనకు సీఎం పదవిని కట్టబెట్టలేమనే చర్చ కూడ లేకపోలేదు. ఈ ఏడాది ఏప్రిల్ లోపుగా కేటీఆర్ కు సీఎం పగ్గాలను అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
undefined
వచ్చే నెలలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు పూర్తైన తర్వాత సీఎం పదవి విషయమై మార్పు చోటు చేసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికల లోపుగానే ఈ తతంగం పూర్తి చేసే అవకాశాలను కూడ తోసిపుచ్చలేమని మరికొందరు చెబుతున్నారు.
undefined
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు. అదే రోజున లేదా ఆ తర్వాత వచ్చే మంచి ముహుర్తానికి కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ కూడ సాగుతోంది. ఏప్రిల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు వరకు వేచి చూసే అవకాశాలు కూడ లేకపోలేదనే మరికొందరు నేతలు కూడ చెబుతున్నారు.
undefined
కేసీఆర్ ఫామ్ హౌస్ కే ఎక్కువగా పరిమితమౌతున్నందున పలు కార్యక్రమాలను తన భుజాలపై వేసుకొని కేటీఆర్ నడిపిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కేటీఆర్ ను సీఎం చేస్తే హరీష్ రావుకు కీలకమైన బాధ్యతలను అప్పగించే అవకాశాలు లేకపోలేదనే చర్చ సాగుతోంది.
undefined
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ కు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.పార్టీలో ఈ రకమైన చర్చ జరుగుతోందని తనకు తెలియదని హరీష్ రావు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.
undefined
కేటీఆర్ సీఎం అయితే తాను ఆయన మంత్రివర్గంలో పనిచేసేందుకు కూడ సిద్దమేనని గతంలో హరీష్ రావు వ్యాఖ్యానించారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడ తాను సమర్ధవంతంగా నెరవేరుస్తానని హరీష్ రావు ప్రకటించారు.
undefined
గురువారం నాడు డిప్యూటీ స్పీకర్ పద్మారావు చేసిన వ్యాఖ్యలు కూడ సంచలనంగా మారాయి. కేటీఆర్ సమక్షంలోనే కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు అంటూ పద్మారావు వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించలేదు. కానీ పద్మారావు తనకు చిచ్ఛా అవుతాడని చెప్పారు.
undefined
పద్మారావు కంటే ముందే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే తరహాలో ప్రకటనలు చేశారు. మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ , తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు కూడ కేటీఆర్ సీఎం కావడానికి అన్ని అర్హతలున్నాయని తేల్చి చెప్పారు.
undefined
click me!