అదిరేటి సెక్రటేరియట్ ముందు అందాల గణపయ్య... ఒకే ఫ్రేములో రెండు అద్భుతాలు (ఫోటోలు) 

First Published | Sep 28, 2023, 4:26 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ వినాయక నిమజ్జన ఉత్సవాలకు ముస్తాబయ్యింది. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రతో ఈ నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. తరలివచ్చిన అశేష భక్తజనసందోహం మద్య బొజ్జగణపయ్య శోభాయాత్ర ఉదయమే ప్రారంభమయ్యింది. హైదరాబాద్ అందాలకు మరింత సోగసులు అద్దుతూ అందంగా మెరిసిపోతున్న నూతన సెక్రటేరియట్ భవనం, తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన అమర జ్యోతి అందాల మధ్యలోంచి ఆ మూషిక వాహనుడు వెళుతుంటే చూసేందుకు భక్తుల రెండుకళ్లు చాలలేవని అనడం అతిశయోక్తి కాదు. ఇలా ఆద్యంతం అట్టహాసంగా సాగిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర హుస్సేన్ సాగర్ కు చేరుకోవడంతో ముగిసింది. పదకొండు రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న బడా గణేషుడు సాగర జలాల్లో కలిసిపోయారు. 

Khairatabad Ganesh

హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగే వినాయక నిమజ్జన ఉత్సవాలు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి.  ఇవాళ ఉదయమే భారీ సైజులో వున్న బొజ్జ గణపయ్య ఊరేగింపు మొదలయ్యింది. 

Khairatabad Ganesh

ఖైరతాాబాద్ లో ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర హుస్సేన్ సాగర్ వరకు సాగింది. ఈ దారంతా భక్తజనసందోహంతో నిండిపోయింది.  

Latest Videos


Khairatabad Ganesh

గణనాథుడి శోబాయాత్ర కోసం నిర్వహకులతో పాటు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసాయి. దీంతో అనుకున్న సమయానికి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యింది. 

Khairatabad Ganesh

సాగర తీరానికి చేరుకున్న బడా గణేషుడి విగ్రహాన్ని ప్రత్యేక క్రేన్ ద్వారా నీటిలోకి దింపి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవతంగా ముగించారు. 

Khairatabad Ganesh

హుస్సేన్ సాగర్ అందాలను రెట్టింపుచేస్తూ ఖైరతాబాద్ గణనాథుడు కొద్దిసేపు తీరంలో దర్శనమిచ్చాడు.  ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. 

Khairatabad Ganesh

తెలంగాాణ ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ భవన అందాలముందు మూషిక వాహనుడు మరింత మెరిసిపోయాడు.  ఈ దృశ్యం ప్రజలకు ఎంతో కనువిందు చేసింది. 

Khairatabad Ganesh

తెల్లగా మెరిపోతున్న నూతన సెక్రటేరియట్,  అంతెత్తున నిలిచిన ఖైరతాబాద్ గణేషుడి  ఒకే ప్రేములో కనింపించి తెలంగాణ ప్రజలకు కనువిందు చేసారు. 

Khairatabad Ganesh

ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రత్యేక బోట్ లో సాగర జలాల్లో ప్రయాణిస్తూ అధికారులకు తగు సూచనలు చేసారు. 

Khairatabad Ganesh

ఖైరతాబాద్ నుండి హుస్సేన్ సాగర్ కు వెళ్లే దారంతా భక్తులతో నిండిపోయింది.  ఏడాదికోసారి జరిగే బడా గణేషుడి శోభాయాత్రను కళ్లారా చూసేందుకు భక్తజనులు ఎక్కడెక్కడి నుండో తరలివచ్చారు

Khairatabad Ganesh

ఆకాశాన్ని తాకుతుందా అనేలా మహా గణపతి విగ్రహం కనిపించింది.  ఆ దేవదేవుడు దర్శనభాగ్యం కలిగిన భక్తులు ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. 

Khairatabad Ganesh

బొజ్జ గణపయ్య నిమజ్జన వేడుకలకు మహిళల సాంప్రదాయ మరింత శోభను తీసుకువచ్చాయి. కాషాయ వస్త్రాలు, తలకు పగిడి ధరించి మహిళలు సందడి చేసారు. 

Khairatabad Ganesh

ఇలా ఎంతో అట్టహాసంగా సాగిన ఖైరతాబాద్ గణనాథుడు చివరకు హుస్సేన్ సాగర్ జలాల్లో సేదతీరాడు.  వచ్చే ఏడాది మళ్ళీ వస్తానంటూ భక్తులకు బైబై చెప్పి వెళ్లిపోయాారు మహా గణపతి. 

click me!