నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు: కవితకు మంత్రి పదవి దక్కేనా?

First Published Oct 5, 2020, 8:24 PM IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిజామాబాద్ జిల్లా రాజకీయాలను వేడిని పుట్టించాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

ఈ నెల 9వ తేదీన జరగనున్న స్జానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ రాజకీయాలు వేడేక్కాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు కసరత్తు నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధిగా సీఎం కూతురు కల్వకుంట్ల కవిత బరిలో దిగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే కవితను మంత్రివర్గంలోకి తీసుకొంటారా...అనే చర్చ కూడ లేకపోలేదు.
undefined
2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కవిత ఓటమి పాలయ్యాడు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేసిన కవిత ఎంపీగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేల విజయం కోసం ఆమె విస్తృతంగా కృషి చేశారు.
undefined
2019 ఎన్నికల్లో ఎంపీగా కవిత ఓటమికి టీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు కూడ కారణమనే ప్రచారం సాగింది.ఈ విషయమై పార్టీ నాయకత్వానికి సమాచారం కూడ అందిందనే ప్రచారం కూడ లేకపోలేదు.
undefined
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 824 ఓటర్లున్నారు. ఇందులో 70 శాతం టీఆర్ఎస్ కే చెందినవారే. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా యెండల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ అభ్యర్ధిగా సుభాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన భూపతిరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
undefined
ఈ ఎమ్మెల్సీ పదవి కాలం 2022 జనవరిలో ముగియనుంది. 2016 జనవరి 5న ఈ స్థానం నుండి భూపతి రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన నిజామాబాద్ రూరల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
undefined
నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ బలం రోజు రోజుకి పెరిగిపోతోంది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. దీంతో 570 నుండి 645 మందికి పెరిగింది.
undefined
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కవిత విజయం సాధిస్తే కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కుతోందనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుండి కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావులు ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కింది. కవితకు కూడ మంత్రివర్గంలో చోటు కల్పిస్తే వెలమ సామాజికవర్గం నుండి మరొకరికి చోటు దక్కుతోంది.
undefined
ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు కేసీఆర్ మంత్రి పదవిని కేటాయించారు. గత టర్మ్ లో కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలు మంత్రులుగా లేరు.ఈ దఫా కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కి మంత్రి పదవులు కట్టబెట్టారు.
undefined
వీరిద్దరిని ఎవరిని తొలగించి పదవులు కట్టబెట్టే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపడితే కవితకు మంత్రి పదవి దక్కే అవకాశాలను కొట్టిపారేయలేమనే చర్చ కూడ ఉంది.
undefined
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల కోసం ప్రజా ప్రతినిధులతో టీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
undefined
click me!