నిజామాబాద్‌లో కవిత గెలుపు: బీజేపీ, కాంగ్రెస్ కొంపముంచిన క్రాస్ ఓటింగ్

First Published Oct 12, 2020, 4:47 PM IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చూపలేకపోయాయి. 

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడ దక్కలేదు.ఈ రెండు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్ధి కవిత భారీ మెజారిటీతో ఈ స్థానం నుండి విజయం సాధించారు.
undefined
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 9వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 824 ఓట్లున్న ఈ స్థానంలో 823 ఓట్లు పోలయ్యాయి.టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితకు 728 ఓట్లు దక్కాయి. బీజేపీకి 56, కాంగ్రెస్ కు 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. 10 ఓట్లు చెల్లలేదు.
undefined
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్లు దక్కలేదు. తమకు ఉన్న ఓట్లను కూడ ఆ పార్టీలు తమ అభ్యర్దులకు వేయించుకోలేకపోయారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్ధికి భారీ మెజారిటీ దక్కింది.
undefined
ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ కు 494 మంది ప్రజా ప్రతినిధుల బలం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి 154 మంది బలం ఉంది. బీజేపీకి 84 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
undefined
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుగానే టీఆర్ఎస్ లోకాంగ్రెస్, బీజేపీలకు చెందిన ప్రజా ప్రతినిధులు చేరారు. దీంతో ఈ రెండు పార్టీల బలం గణనీయంగా తగ్గిపోయింది.రెండు దఫాలు వాయిదా పడిన ఈ ఎన్నికలు ఈ నెల 9వ తేదీన జరిగాయి.
undefined
ఈ ఎన్నికల్లో గెలవాలంటే 413 ఓట్లు రావాలి. అయితే టీఆర్ఎస్ అభ్యర్ధి కవితకు 728 ఓట్లు దక్కాయి. టీఆర్ఎస్, బీజేపీల నుండి సుమారు 196 ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్ధి కవితకు పడ్డాయి. రెండు పార్టీల అభ్యర్ధులు తమ పార్టీకి ఉన్న ఓట్లను కూడ తమ అభ్యర్ధులకు వేయించుకోవడంలో వెనుకపడ్డారు.
undefined
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగబోయే వేళ టీఆర్ఎస్ కి ఈ ఫలితాలు ఉత్సాహన్ని ఇస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లకు మాత్రం ఈ ఫలితాలు నిరాశను మిగిల్చనున్నాయి.
undefined
ఈ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలకు ప్రజా ప్రతినిదులు టీఆర్ఎస్ లో చేరుతున్నా ఆ పార్టీలు ఏం చేయలేక మిన్నకుండిపోయారు. ఈ పరిణామాలు టీఆర్ఎస్ కు మరింత కలిసివచ్చాయి.
undefined
click me!