తగ్గిన కిక్కు: తెలంగాణలో తగ్గిన బీర్ల విక్రయాలు

First Published Oct 11, 2020, 1:44 PM IST

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే బీర్ల విక్రయాలు తగ్గినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా తగ్గాయి. తెలంగాణలో బీరు విక్రయాలు గణనీయంగా తగ్గినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.సాధారణంగా తెలంగాణలో బీర్ల విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో బీర్ల అమ్మకాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం బీర్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. కరోనా కూడ బీర్ల విక్రయాలపై ప్రభావం చూపిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
undefined
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో మద్యం దుకాణాలు మూసివేశారు. ఈ ఏడాది మే 6వ తేదీన రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచారు.2019-20 ఎక్సైజ్ ఈయర్ లో మే నుండి సెప్టెంబర్ వరకు 2,21,71,855 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.
undefined
అయితే ఈ ఏడాది (2020-21)కేవలం 1,05,57, 496 కేసుల బీర్లు మాత్రమే విక్రయమైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,05,57, 496 కేసుల మేర బీర్ల విక్రయాలు తగ్గిపోయాయి.
undefined
మే మాసంలో మద్యం దుకాణాలను తెరిచే సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్వల్పంగా మద్యం ధరలను పెంచింది. మద్యం ధరలను తెరిచిన వారం రోజుల పాటు లిక్కర్ సేల్స్ తో పాటు బీరు విక్రయాలు బాగా జోరుగా సాగాయి.
undefined
మద్యం ధరల పెంపుతో గత ఏడాది రెండు త్రైమాసికాలతో పోలిస్తే ప్రస్తుత ఏడాదిలో 10.74 రాబడి వృద్ధి నమోదైంది.బీరు ధరతో క్వార్టర్ మద్యం వస్తుండడంతో మద్యం ప్రియులు బీరుకు బదులుగా మద్యం కొనుగోలుకు ఆసక్తి చూపారు.
undefined
2019-20 లో ఏప్రిల్ -సెప్టెంబర్ మాసంలో 159.35 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కేవలం 16.82 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు మాత్రమే జరిగినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.
undefined
ఇక ఏడాది 2020-21 మే మాసంలో 23,22,923 , జూన్ లో 28,77,578, జూలైలో22,99,525, ఆగష్టులో 19,37,621, సెప్టెంబర్ లో21,76,710 కేసుల బీర్లు విక్రయాలు జరిగాయి.ఈ ఐదు మాసాల్లో కేవలం 1,16,114,357 కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్టుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి.
undefined
click me!