ఈటలను టార్గెట్ చేసిన విజయశాంతి.. ట్విట్టర్‌లో పంచాయితీ.. టీ బీజేపీలో కలకలం..!!

First Published May 31, 2023, 10:19 AM IST

తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ‌హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీ బీజేపీ నేతల మధ్య గతకొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. 

తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ‌హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీ బీజేపీ నేతల మధ్య గతకొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలు ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మహిళా నేత విజయశాంతి మధ్య విభేదాలు ట్విట్టర్‌ వేదికగా బయటకు వచ్చాయి. టీ బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఈటలను టార్గెట్‌గా చేసుకుని విజయశాంతి విమర్శలు గుప్పించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు చేరికలతో వచ్చాయా? అని ప్రశ్నించారు. బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలేనని అన్నారు. 

అసలేం జరిగిందంటే.. ఇటీవల ఈటల రాజేందర్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు బీజేపీలో చేరడం కష్టమేనని కామెంట్ చేశారు. ప్పటివరకు వారిని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆపగలిగాననని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరమంటే వాళ్లే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని అని అన్నారు. 

అయితే ఈటల కామెంట్స్‌పై స్పందించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీష్ రావు.. బీజేపీ పని అయిపోయిందని విమర్శలు చేశారు. బీజేపీలో ఎవరూ చేరడం లేదని ఈటల చేతులు ఎత్తేశారన్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయశాంతి.. ‘‘బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల  చేతులెత్తేశారు.. చిట్ చాట్ లో ఈటల చెప్పారు.. చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు .....నాటి ఆ దుబ్బాక, జీహెచ్ఎంసీ, నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా...! చేరికల కమిటీతో వచ్చాయా..? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా...! విశ్లేషించుకోవాలి..’’ అని విజయ శాంతి పేర్కొన్నారు. 

‘‘బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలే.. బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమే.. చేరికల కమిటీ పేరు చెప్తూ.. చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ  మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదు. ఇది హరీష్ రావుకు తెలవంది కాదు..’’ అని పేర్కొన్నారు. 

అయితే విజయశాంతి హరీష్ రావును విమర్శిస్తూ ట్వీట్ చేసినప్పటికీ.. దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చేరికల కమిటీతో వచ్చాయా..? అని ప్రశ్నించడం ద్వారా ఆమె ఈటలను కూడా టార్గెట్ చేశారనే మాట వినిపిస్తుంది. 

ఇక, గతంలో అన్ని పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఈటల రాజేందర్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈటల కామెంట్స్‌పై స్పందించిన విజయశాంతి.. బీజేపీలో కోవర్ట్‌లు ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

click me!