హైద్రాబాద్‌లో డ్రమ్ములో డెడ్‌బాడీ: పురాన్‌సింగ్ ను హత్య చేయించిన మాజీ లవర్

First Published | Jun 6, 2023, 1:19 PM IST

 హైద్రాబాద్  పహాడీ షరీఫ్  పోలీస్ స్టేషన్ పరిధిలోని  డ్రమ్ములో డెడ్ బాడీ మిస్టరీని పోలీసులు చేధించారు. మృతుడు  పురాన్ సింగ్ గా గుర్తించారు. మాజీ ప్రియురాలే   పురాన్ సింగ్  హత్యకు కారణంగా  పోలీసులు తేల్చారు.
 
హైద్రాబాద్‌లో డ్రమ్ములో డెడ్‌బాడీ: పురాన్‌సింగ్ ను హత్య చేయించిన మాజీ లవర్

 నగరంలోని  పహాడీషరీఫ్  పోలీస్ స్టేషన్ పరిధిలో   సంచలనం సృష్టించిన డ్రమ్ములో డెడ్ బాడీ  కేసును  పోలీసులు చేధించారు.  డ్రమ్ములో డెడ్ బాడీ  ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రానికి  చెందిన  పురాన్ సింగ్ దిగా  పోలీసులు గుర్తించారు.  ఈ ఏడాది మే  22న  పురాన్ సింగ్అదృశ్యమయ్యాడు.

హైద్రాబాద్‌లో డ్రమ్ములో డెడ్‌బాడీ: పురాన్‌సింగ్ ను హత్య చేయించిన మాజీ లవర్

  పురాన్ సింగ్ భార్య  పోలీసులకు  ఫిర్యాదు  చేసింది.  అయితే  గత నెల 25వ తేదీన   చెరువులో  డ్రమ్ములో  పురాన్ సింగ్  డెడ్ బాడీ లభ్యమైంది.   పురాన్ సింగ్   హత్య కు  జయదేవి అనే మహిళ కీలకంగా  వ్యవహరించిందని  పోలీసులు గుర్తించారు.  

హైద్రాబాద్‌లో డ్రమ్ములో డెడ్‌బాడీ: పురాన్‌సింగ్ ను హత్య చేయించిన మాజీ లవర్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన  జయదేవి, పురాన్ సింగ్   గతంలో  ప్రేమించుకున్నారు.   అయితే  జయదేవిని  కాదని  పురాన్ సింగ్  మరో యువతిని వివాహం  చేసుకున్నాడు.  పురానాసింగ్ కు ఇద్దరు పిల్లలు. పురానా  సింగ్ ప్రస్తుతం  హైద్రాబాద్ లో  నివాసం ఉంటున్నాడు.  

హైద్రాబాద్‌లో డ్రమ్ములో డెడ్‌బాడీ: పురాన్‌సింగ్ ను హత్య చేయించిన మాజీ లవర్

పురాన్ సింగ్  చాంద్రాయణగుట్ట  పోలీస్ స్టేషన్ పరిధిలో  నివాసం ఉంటున్నాడు. పానీ పూరీ  బండి  నడుపుకొంటూ  కుటుంబాన్ని  పోసించుకుంటున్నాడు.  ఈ నెల  22న  తన భర్త కన్పించడం లేదని  పురాన్ సింగ్ భార్య మమత దేవి  పోలీసులకు  ఫిర్యాదు  చేసింది.  ఈ ఫిర్యాదు  మేరకు  పోలీసులు  దర్యాప్తు  చేశారు. 

హైద్రాబాద్‌లో డ్రమ్ములో డెడ్‌బాడీ: పురాన్‌సింగ్ ను హత్య చేయించిన మాజీ లవర్

తనను  కాదని  మరో యువతిని పురాన్ సింగ్  పెళ్లి  చేసుకోవడంతో  జయదేవి  పురాన్ సింగ్  పై  కక్ష పెంచుకుంది.  దీంతో హైద్రాబాద్ కు  జయదేవి   చేరుకుంది. హైద్రాబాద్ లో నజీమ్ అనే వ్యక్తిని  ప్రేమించింది.   తనకు  పురాన్ సింగ్ తో  ఉన్న లవ్ ఎఫైర్ ను  ప్రియుడు నజీమ్ కు  చెప్పింది.  పురాన్ సింగ్  ను  హత్య  చేయాలని  ప్రియుడు నజీమ్  ను  కోరింది.  ప్రియురాలి  కోరిక తీర్చేందుకు  నజీమ్ ఒప్పుకున్నాడు.

హైద్రాబాద్‌లో డ్రమ్ములో డెడ్‌బాడీ: పురాన్‌సింగ్ ను హత్య చేయించిన మాజీ లవర్

మైనర్ బాలుడి సహాయంతో  పురాన్ సింగ్  ను  పిలిపించారు నజీమ్.  పురాన్ సింగ్  ను  తన స్నేహితుడు  సుగుణారామ్  , జయదేవి  సహాయంతో  నజీమ్  హత్య  చేశాడు.   పురానా సింగ్ డెడ్ బాడీ ని  డ్రమ్ములో కుక్కి చెరువులో  వేశారు. పురాన్ సింగ్ ను హత్య చేసిన  నజీమ్,  జయదేవి,  సుగుణారామ్ ను  పోలీసులు అరెస్టు  చేశారు. 

Latest Videos

click me!