మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

First Published | Jun 6, 2023, 12:05 PM IST

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు  ఈ నెల  9 లేదా  10వ తేదీన  సమావేశం కానున్నారు.  ఎన్నికల్లో అనుసరించాల్సిన  వ్యూహంపై దిశా నిర్ధేశం  చేయనున్నారు. 

మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

ఈ ఏడాది  చివర్లో జరిగే  తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు  కాంగ్రెస్ పార్టీ  సన్నద్దం కానుంది. కర్ణాటక రాష్ట్రంలో  జరిగిన  అసెంబ్లీ  ఎన్నికల్లో  కాంగ్రెస్ విజయం సాధించడంతో  ఉత్సాహంతో  తెలంగాణ ఎన్నికలకు  కాంగ్రెస్ పార్టీ  సిద్దమౌతుంది. 

మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

అమెరికా పర్యటనలో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ  ఉన్నారు. ఈ నెల  8వ తేదీన  రాహుల్ గాంధీ అమెరికా నుండి   న్యూఢిల్లీకి తిరిగి వస్తారు. తెలంగాణకు  చెందిన  కొందరు నేతలు కూడా  రాహుల్ పర్యటనలో ఉన్నారు

మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి,  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి,  మాజీ ఎంపీ మధు యాష్కీ,  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య  తదితరులు  అమెరికా టూర్ లో  ఉన్నారు.  రాహుల్ తో పాటే  తెలంగాణ  నేతలు  న్యూఢిల్లీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. 

మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

ఈ  నెల  9వ తేదీ లేదా  10 వ తేదీల్లో తెలంగాణ  నేతలతో   రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమావేశం  నిర్వహించనున్నారు. తెలంగాణ  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై  తెలంగాణ నేతలతో  రాహుల్ గాంధీ, ప్రియంకలు  దిశానిర్ధేశం  చేయనున్నారు. 

మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల వ్యూహాకర్త  సునీల్ కనుగోలు  టీమ్  రెండేళ్లుగా  పనిచేస్తుంది.  కర్ణాటకలో  కూడా  సునీల్ కనుగోలు టీమ్  కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసిన విషయం తెలిసిందే. 

మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

సునీల్ టీమ్  వ్యూహాం మేరకు  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్రంలో  ముందుకు వెళ్తుంది.  సునీల్ టీమ్  ఎప్పటికప్పుడు  రాహుల్ గాంధీకి  తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ  బలం, బలహీనతలు,  ప్రత్యర్ధుల సత్తా  ఏమిటనే విషయమై   సమాచారం అందిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా  రాహుల్ గాంధీ  కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నారు

మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

వరంగల్ సభకు ముందు  న్యూఢిల్లీలో  కాంగ్రెస్ నేతలతో  రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  సునీల్ కనుగోలు  ఇచ్చిన  సమాచారం  ఆధారంగా  పార్టీ నేతలతో   రాహుల్ గాంధీ  చర్చించారు. 

మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

తెలంగాణ  రాష్ట్రం  ఇచ్చి కూడా  వరుసగా  రెండు దఫాల కాంగ్రెస్ పార్టీ  ఇక్కడ అధికారాన్ని  కోల్పోయింది.  ఈ దఫా  అధికారాన్ని దక్కించుకోవాలని  కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలగా  ఉంది

మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

అయితే  కాంగ్రెస్ కు  బీజేపీ  బ్రేకులు వేస్తుంది.  గతంలో  రాష్ట్రంలో  జరిగిన  రెండు ఉప ఎన్నికల్లో  బీజేపీ విజయం సాధించింది.  ఈ ఉప ఎన్నికల  ఫలితాలు  తెలంగాణలో  బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని  బీజేపీ  ప్రచారం  చేసుకుంటుంది.   అయితే  కర్ణాటకలో  కాంగ్రెస్ విజయం సాధించడంతో  బీజేపీలో చేరిన  కొందరు నేతలు  తిరిగి  కాంగ్రెస్ పార్టీలో  చేరుతారనే  ప్రచారం సాగుతుంది.  ఈ ప్రచారాన్ని  బీజేపీ నేతలు ఖండించారు

Latest Videos

click me!