Huzurabad Bypoll: ఈటలను చూసి అయ్యో అయ్యో అని జాలిపడకండి...: మంత్రి కొప్పుల ఈశ్వర్

First Published | Oct 25, 2021, 5:37 PM IST

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ టీఆర్ఎస్ పార్టీ, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహించారు. 

కరీంనగర్: ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు... రెండుసార్లు మంత్రి అయ్యాడు...కాబట్టి ఈటల రాజేందర్ ను చూసి అయ్యో అయ్యో అని అనాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈటలనే టిఆర్ఎస్ ను వదిలి పోయాడని... అందువల్లే సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ప్రజలకు అండగా వున్నామని భరోసా ఇస్తున్నామన్నారు. ఏది మంచి, ఏది చెడు అనేది ప్రజలందరికి తెలుసన్నారు. ఈటల గెలిస్తే ఆయనకే మంచి జరుగుతుంది... టిఆర్ఎస్ గెలిస్తే హుజురాబాద్ ప్రజలందరూ బాగు పడతారని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. 
 

మంత్రి కొప్పుల ఈశ్వర్, , ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇవాళ(సోమవారం)  జమ్మికుంటలోని 1, 2వ వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... టిఆర్ఎస్ ఇచ్చే పార్టీ అయితే బిజెపి  గుంజుకునే పార్టీ అని ఎద్దేవా చేసారు. 


''మనం మొదటి నుంచి TRS లోనే ఉన్నాం.  మనమందరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాం. eatala rajender టిఆర్ఎస్ నుంచి పోవడంతో CM KCR హుజురాబాద్ బాధ్యతను మా అందరికీ అప్పగించారు. అందువల్లే ఈ జమ్మికుంట మునిసిపాలిటీని గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం. ఎన్నో సమస్యలు పరిష్కరించాం. ప్రజలకు అండగా ఉన్నాం'' అని koppula eshwar అన్నారు. 

read more  Huzurabad Bypoll: 27న ఈటల దంపతులు సొమ్మసిల్లి పడిపోయి... సానుభూతి డ్రామా: ఎమ్మెల్సీ పల్లా సంచలనం

''మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనలు, కార్యదక్షత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఒంటరి మహిళల సంక్షేమం గురించి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్. లక్షమంది ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నారు'' అని కొప్పుల తెలిపారు.

''గతంలో ప్రైవేటు ఆస్పత్రిలోనే మహిళల ప్రసవాలు జరిగేవి. దీంతో పేదలు అప్పులు చేసే పరిస్థితి వుండేది. పేదల బాధలు తెలిసిన సీఎం కేసిఆర్ మంచి ఆలోచన చేసి అమ్మ ఒడి పథకం తెచ్చారు.  దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది'' అని పేర్కొన్నారు. 
 

''గత పాలకులు చెరువులను పట్టించుకోలే. కేసీఆర్ 46వేల చెరువులను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బాగు చేయించారు. అలాగే గతంలో మంచినీళ్లకు గోస పడ్డం, అప్పుడు నాయకులు వస్తే తాగేందుకు నీళ్లు కావాలంటూ గొడవకు దిగే వాళ్లు. నేడు మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నాం'' అని తెలిపారు.

''24గంటలు విద్యుత్ సరఫరా జరుగుతోంది. రైతులకు పంట సాయం, బీమా సౌకర్యాన్ని కేసిఆర్ ప్రవేశపెట్టారు. రైతు చనిపోతే 10రోజుల్లోనే రూ.5 లక్షలు ఇంటికి తెచ్చి ఇస్తున్నాం. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర వాసులు మా ప్రాంతాలను తెలంగాణలో కలిపితే బాగుండు అంటున్నారు'' అని పేర్కొన్నారు. 

''దళిత బంధుతో ఎస్సీలు బాగుపడ్తరని బిజెపి వాళ్లు ఆపించిండ్రు.  వారం రోజుల్లో మళ్లీ దళిత బంధు మొదలవుతది. ఆ తర్వాత బహుజనులందరికి మంచి జరిగే పథకాలు వస్తయ్. బిజెపికి ఓటేస్తే పెంచిన ధరలను మనమంతా ఒప్పుకున్నట్టయితది. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మంచి మనిషి, ఉద్యమకారుడు, పేదింటి యువకుడు. అతడికి ఓటేసి గెలిపించండి... మీకు అందుబాటులో ఉంటడు,సేవ చేస్తడు'' అని మంత్రి ఈశ్వర్ సూచించారు.
 

Latest Videos

click me!