ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబరం... ప్రపంచప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా భవనంపై కనువిందు

First Published Oct 24, 2021, 7:54 AM IST

శనివారం రాత్రి దుబాయ్ లో ఓ అద్భుత ఆవిష్కృతం అయ్యింది. ప్రపంచ ప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా భవనంపై తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను ప్రదర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలు ఖండాంతరాలు దాటింది. ఇటీవలే ఎంతో అంగరంగవైభవంగా జరిగిన బతుకమ్మ పండగ శోభ మరోసారి దుబాయ్ లో కనిపించింది. ఖండాంతరాలు దాటిన తెలంగాణ సాంస్కృతిక వైభవం ప్రపంచంలోని అదిపెద్ద భవనం బూర్జ్ ఖలీఫాపై కనిపించింది. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో పూజించే బతుకమ్మను బూర్జ్  ఖలీఫా నెత్తినెత్తుకుంది. 

శనివారం రాత్రి దుబాయ్ లో ఓ అద్భుత ఆవిష్కృతం అయ్యింది. ప్రపంచ ప్రఖ్యాత burj khalifa భవనంపై తెలంగాణ సాంస్కృతిక చిహ్నం bathukamma ను ప్రదర్శించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఫోటోను కూడా ఈ భవన తెరపై ప్రదర్శించారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన మూడు నిమిషాల నిడివి గల వీడియోను రెండుసార్లు ప్రదర్శించారు. 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ వీడియో ప్రదర్శన ఏర్పాటు చేసారు. తెలంగాణ పూలపండగ బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యవేక్షణలో ఈ ఏర్పాటు జరిగింది. 

READ MORE  రెహ్మాన్‌ సారథ్యంలో బతుకమ్మ పాట `అల్లిపూల వెన్నెల`.. ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత, గౌతమ్‌మీనన్‌

బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ, కేసీఆర్ ప్రదర్శన మొదలవగానే కార్యక్రమానికి హాజరైన ప్రవాసులతో పాటు టీవీల్లో,వివిధ మాధ్యమాల ద్వారా చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానికం  పులకించిపోయారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది బతుకమ్మ పండుగ వీడియోలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.  

ఇదిలావుంటే ఇటీవల దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే బతుకమ్మ పండుగకి ప్రత్యేకతని తీసుకొచ్చారు ఆస్కార్ మ్యూజిక్‌ డైరెక్టర్ ఏ. ఆర్‌ రెహ్మాన్. తెలంగాణ జాగృతి సారథ్యంలో బతుకమ్మ పాటని తీసుకొచ్చారు. `అల్లిపూల వెన్నెల` పేరుతో ప్రత్యేకంగా బతుకమ్మ పాటని రూపొందించారు. ఇందులో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కూడా భాగం కావడం విశేషం. 
 

తెలంగాణ ఆడపడుచల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరిసింది. ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ar rehman సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట `అల్లిపూల వెన్నెల` గా సరికొత్త సొబగులు అద్దుకుంది. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు mlc kavitha ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు. 

ప్రఖ్యాత దర్శకుడు gautam menon దర్శకత్వం వహించిన ఈ పూల సింగిడిని ఇవాళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించగా,  జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు.  

తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతో కృషి చేస్తున్నారు. అందుకోసమే ఏఆర్ రెహ్మాన్, గౌతమ్ మీనన్ లతో పాటు అయినా బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శన అయినా.

click me!