తెలంగాణకు అల్పపీడనం ముప్పు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

Published : Aug 16, 2025, 11:50 AM IST

Heavy Rain Alert in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శనివారం నుంచి ఆదివారం వరకు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

PREV
15
తెలంగాణకు అల్పపీడనం ముప్పు

Heavy Rain Alert in Telangana:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని (Rain Alert) వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. అలాగే.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

25
రికార్డు స్ధాయిలో వర్షపాతం

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్‌లోని చిలిప్‌చెడ్‌: 150 మి.మీ., కొత్తగూడ (మహబూబాబాద్): 129 మి.మీ., వాట్ పల్లె (సంగారెడ్డి): 123 మి.మీ., మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబాబాద్‌లో 64–117 మి.మీ. వర్షపాతం నమోదైంది.

35
ఈ జిల్లా అతి భారీ వర్షాలు

బంగాళఖాతంతో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

అతి భారీ వర్షాలు పడే జిల్లాలు: నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి.

భారీ వర్షాలు పడే జిల్లాలు: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్.

45
ఆరెంజ్ అలెర్ట్

అతి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ (orange alert) జారీ చేసింది. శనివారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. మరో 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

55
వాతావరణ శాఖ హెచ్చరిక

రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆకాశం మేఘావృతంగా ఉండి, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఇప్పటికే అనేక చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories