హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆ జంట మాయం వెనుక శ్రీనివాస్ రెడ్డి?

First Published Jun 3, 2019, 11:02 AM IST

శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మామిడి తోటలో పని ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చిన జంట ఆచూకీ కన్పించకపోవడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటను కూడ శ్రీనివాస్ రెడ్డి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

మరో వైపు శ్రీనివాస్ రెడ్డి అశ్లీల వెబ్‌సైట్లను ఎక్కువగా చూసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి మొబైల్‌లో ఎక్కువగా అశ్లీల వెబ్‌సైట్లను సెర్చ్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
undefined
హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి నుండి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. శ్రీనివాస్ రెడ్డి చేతిలో అత్యాచారానికి గురై హత్య చేయబడిన కల్పన, మనీషాలకు చెందిన ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
undefined
హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. శ్రీనివాస్ రెడ్డి నుండి సమాచారాన్ని సేకరించాల్సి ఉందని కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన భువనగిరి పోలీసులకు మూడు రోజుల పాటు శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి ఇస్తూ నల్గొండ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
undefined
ఈ ఆదేశాలకు అనుగుణంగా శనివారం నాడు మధ్యాహ్నం పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని తమ అదుపులోకి తీసుకొన్నారు. హాజీపూర్‌ హత్యలతో పాటు ఇతర నేరాలపై శ్రీనివాస్ రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
undefined
హాజీపూర్ గ్రామానికి సమీపంలోని కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో నిందితుడిని తిప్పారు. మూడు హత్యలకు సంబంధించిన విషయాలపై పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని ఆరా తీశారు. కల్పన, మనీషాలకు చెందిన గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల సమాచారాన్ని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు అందించారు.
undefined
నాలుగేళ్ల క్రితం కల్పనను హాజీపూర్ నుండి మైసిరెడ్డిపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో రేప్ చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి బావిలో పూడ్చిపెట్టాడు. కల్పన స్కూల్ యూనిఫాం, టిఫిన్ బాక్స్‌ను బావిలో వేశాడు.
undefined
ఈ హత్య విషయమై ఆధారాలు లభ్యం కాకుండా ఉండేందుకు శ్రీనివాస్ రెడ్డి జాగ్రత్తలు తీసుకొన్నాడు. మరునాడు ఇదే ప్రాంతంలో కల్పన స్కూల్ గుర్తింపు కార్డు కన్పించడంతో దాన్ని చెట్ల పొదల్లో పారేశాడు.
undefined
మనీషాను మర్రి బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బావిలో పూడ్చి పెట్టాడు. మనీషా ఆధార్, సెల్‌ఫోన్‌ను తీసుకొని పోలీసుస్టేషన్‌ సమీపంలోని కర్కలమ్మ కుంటలో వేశాడు. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆదివారం నాడు కర్కలమ్మకుంట సమీపంలో మనీషా ఆధార్ కార్డు లభ్యమైంది.ఐడీ కార్డు కూడ లభ్యమైంది. మనీషా సెల్‌ఫోన్ ఇంకా దొరకలేదు.
undefined
వరంగల్ నుండి ఓ జంటను మామిడి తోటల్లో పని ఉందని తీసుకొచ్చాడు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే సమయంలో తన వద్ద ఉంచుకొన్నాడు. ఆ దంపతుల జాడ ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. ఈ దంపతుల ఆచూకీ కన్పించకుండా పోవడంలో కూడ శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉండి ఉండొచ్చనే అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.
undefined
శ్రీనివాస్ రెడ్డి మొబైల్‌ పోన్‌లో అశ్లీ వెబ్‌సైట్ల సెర్చింగ్‌ చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.ఆశ్లీల వెబ్‌సైట్లతో శ్రీనివాస్ రెడ్డి కాలయాపన చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రభావంతోనే అత్యాచారాలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
undefined
click me!