తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?

Published : Feb 26, 2026, 12:55 PM IST

Amruth Bharath Express: ఈ రైలు నాగర్‌కోయిల్ నుంచి బయలుదేరి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి వరకు నడుస్తుంది. ఇది హై-స్పీడ్, పుష్-పుల్ టెక్నాలజీతో కూడిన రైలు. ఇందులో నాన్-ఏసీ స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

PREV
15
రైల్వే శాఖ మరో శుభవార్త

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత రైల్వే శాఖ మరో శుభవార్త అందించింది. కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తూ, తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుండి హైదరాబాద్‌లోని చర్లపల్లి వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును ప్రారంభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1వ తేదీన మధురైలో ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు.

25
మరికొన్ని రైలు సర్వీసులు

ఈ రైలు నాగర్‌కోయిల్ నుంచి బయలుదేరి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి వరకు నడుస్తుంది. ఇది హై-స్పీడ్, పుష్-పుల్ టెక్నాలజీతో కూడిన రైలు. ఇందులో నాన్-ఏసీ స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. మధ్యతరగతి ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరలో అందించడమే ఈ రైలు లక్ష్యం.

35
అమృత్ భారత్ స్టేషన్ పథకం

అలాగే ప్రధాని మోదీ ఇదే రోజున మరికొన్ని రైలు సర్వీసులను కూడా ప్రారంభించనున్నారు. మంగళూరు సెంట్రల్ - రామేశ్వరం - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, తాంబరం - మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూర్ - ధనాబాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ లిస్టులో ఉన్నాయి. అంతేకాకుండా, దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద కొత్తగా ఆధునీకరించిన 8 స్టేషన్లను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.

45
చర్లపల్లికి ప్రాధాన్యం

సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై రద్దీని తగ్గించడానికి చర్లపల్లిని నాలుగో ప్రధాన రైల్వే టెర్మినల్‌గా రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే గత నెలలో చర్లపల్లి-తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

55
తెలంగాణ, ఏపీ ప్రజలకు..

ఇప్పుడు నాగర్‌కోయిల్ రైలు కూడా అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణ, ఏపీ ప్రజలకు కేరళ, తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం సులభతరం అవుతుంది. ప్రస్తుతానికి ఈ రైలు సమయ వేళలు, ఆగే స్టేషన్ల పూర్తి షెడ్యూల్‌ను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

Read more Photos on
click me!

Recommended Stories