తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇవే..

First Published Jun 1, 2023, 4:35 PM IST

తెలంగాణ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ అందించాలని యాజమాన్యం నిర్ణయం  తీసుకుంది. 
 

తెలంగాణ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ అందించాలని యాజమాన్యం నిర్ణయం  తీసుకుంది. 
 

జూన్ నెల జీతంతో కలిసి డీఏను అందించనున్నారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్, చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ గురువారం ప్ర‌క‌టించారు. మిగిలిన ఒక్క డీఏను కూడా త్వరలోనే సంస్థ ప్రకటిస్తుందని కూడా చెప్పారు. 
 

sajjanar

2022 జూలై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను(కరువు భత్యం) మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని స్పష్టం చేశారు. 

‘‘తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది’’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్, చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ తెలిపారు.

‘‘క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది’’ వారు వీసీ సజ్జనార్, బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. 

Latest Videos

click me!