మంచి పనితీరు కనబర్చిన వారికే టిక్కెట్లు: తేల్చేసిన కేటీఆర్

First Published | Jun 1, 2023, 2:45 PM IST

ఈ ఏడాది చివర్లో జరిగే  అసెంబ్లీ  ఎన్నికల్లో  బీఆర్ఎస్  మూడోసారి  తెలంగాణలో అధికారంలోకి రానుందని  మంత్రి  కేటీఆర్  ధీమాను వ్యక్తం  చేశారు. 

మంచి పనితీరు కనబర్చిన వారికే టిక్కెట్లు: తేల్చేసిన కేటీఆర్

 మంచి  పనితీరు  కనబర్చిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పారు. 

గురువారంనాడు  హైద్రాబాద్ లో మంత్రి కేటీఆర్  మీడియాతో చిట్  చాట్  చేశారు.  కొందరు ఎమ్మెల్యేలు తమ పనితీరును  మెరుగుపర్చుకోవాలని  కేసీఆర్ సూచించిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. 

మంచి పనితీరు కనబర్చిన వారికే టిక్కెట్లు: తేల్చేసిన కేటీఆర్

KCR, cm kcrతెలంగాణలో మూడోసారి  కేసీఆర్ సీఎం అవుతారని ఆయన ధీమాను వ్యక్తం  చేశారు.  దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు   తమ సీఎం అభ్యర్ధి  ఎవరో చెప్పాలని  కేటీఆర్  డిమాండ్  చేశారు.

మంచి పనితీరు కనబర్చిన వారికే టిక్కెట్లు: తేల్చేసిన కేటీఆర్

కేవలం  ఒక పార్టీని  అధికారంలోంచి  దించడానికి బీఆర్ఎస్ ఏర్పడలేదన్నారు.  
రాహుల్ గాంధీ  కాంగ్రెస్ ను వదిలేసి  ఎన్జీఓను గానీ దుకాణాన్ని  గానీ నడుపుకోవాలని  ఆయన  సూచించారు. 

మంచి పనితీరు కనబర్చిన వారికే టిక్కెట్లు: తేల్చేసిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు  ఇంకా ఆరు  మాసాల  సమయం ఉందన్నారు. టిక్కెట్ల విషయంలో  ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు.

మంచి పనితీరు కనబర్చిన వారికే టిక్కెట్లు: తేల్చేసిన కేటీఆర్

 ఓఆర్ఆర్  లీజు  నియమ నిబంధనల  ప్రకారం జరిగిందన్నారు.ఓఆర్ఆర్  లీజు విషయంలో  ఆధారాలుంటే  విపక్షాలు  కోర్టుకు వెళ్లాలని  ఆయన  సూచించారు.  తెలంగాణలో బీజేపీ లేనే లేదన్నారు. 

మంచి పనితీరు కనబర్చిన వారికే టిక్కెట్లు: తేల్చేసిన కేటీఆర్

సిట్టింగ్  ఎమ్మెల్యేలకు  వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తామని కేసీఆర్ గతంలో  ప్రకటించారు. అయితే  కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై  కేసీఆర్ అసంతృప్తిని వ్యక్తం  చేశారు   రాష్ట్ర వ్యాప్తంగా  ఆయా నియోజకవర్గాల్లో  పార్టీ పరిస్థితిపై  కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వే  నిర్వహించి  అందుకు అనుగుణంగా  వ్యూహా రచన చేస్తున్నారు. 

మంచి పనితీరు కనబర్చిన వారికే టిక్కెట్లు: తేల్చేసిన కేటీఆర్

కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలున్న విషయాన్ని  కేసీఆర్  ఇటీవల  జరిగిన  సమీక్ష సమావేశంలో  ప్రస్తావించారు. దళితబంధు  పథకంలో ఎమ్మెల్యేలు  వాటాలు అడిగారని  కేసీఆర్  సంచలన ఆరోపణలు  చేశారు.

Latest Videos

click me!