బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

First Published | Jun 11, 2023, 11:20 AM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కూచకుళ్ల దామోదర్ రెడ్డి  , ఆయన తనయుడు  రాకేష్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరేందుకు  రంగం సిద్దం  చేసుకుంటున్నారు. 

బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కూచకుళ్ళ దామోదర్ రెడ్డి ఆయన  తనయుడు  రాకేష్  బీఆర్ఎస్ ను  వీడనున్నారని  ప్రచారం సాగుతుంది.   దామోదర్ రెడ్డి ఆయన తనయుడు  రాకేష్ లు  వరుసగా  కార్యకర్తలతో  సమావేశాలు  నిర్వహిస్తున్నారు.  కూచకుళ్ల దామోదర్ రెడ్డి  ఆయన తనయుడు  ఎవరెవరితో  సమావేశం  అవుతున్నారనే  విషయమై  స్థానిక ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి ఆరా తీస్తున్నారు

బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ ఎన్నికల  సమయంలో  స్థానిక  ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి  తనకు సహకరించలేదని కూచకుళ్ల దామోదర్ రెడ్డి  అభిప్రాయంతో  ఉన్నారు.  అయితే  దామోదర్ రెడ్డి  విజయం కోసం తన   శక్తి వంచన లేకుండా  ప్రయ త్నించానని అప్పట్లోనే  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి  తెలిపారు. 

Latest Videos

బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూచకుళ్ల దామోదర్ రెడ్డి విజయం సాధించారు.  ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతి నుండి  ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డితో  ఎమ్మెల్సీ  దామోదర్ రెడ్డి  మధ్య  గ్యాప్ కొనసాగుతుంది.  అంతేకాదు  బీఆర్ఎస్ కార్యక్రమాల్లో  కూడ దామోదర్ రెడ్డి అంటీముట్టనట్టుగా  ఉంటున్నారు.  మంత్రులు, ఇతర  నేతలు  వచ్చిన సమయంలో  దామోదర్ రెడ్డి   హాజరై వెళ్తున్నారు.

బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

బీఆర్ఎస్ ను వీడి  కాంగ్రెస్ లో చేరాలని దామోదర్ రెడ్డి  భావిస్తున్నారని  ఆయన వర్గీయుల్లో  ప్రచారంలో  ఉంది.  దామోదర్ రెడ్డి తనయుడు  రాకేష్ రెడ్డికి నాగర్ కర్నూల్  అసెంబ్లీ టిక్కెట్టును  కేటాయించాలని   దామోదర్ రెడ్డి  కాంగ్రెస్ నేతలను  కోరారని  ప్రచారంలో ఉంది.

బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

అయితే  నాగర్ కర్నూల్  అసెంబ్లీ స్థానం నుండి  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అభ్యర్ధిగా, ఒక్క దఫా  ఇండిపెండెంట్ గా  నాగం జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు.  కానీ  2013లో  ఈ అసెంబ్లీ స్థానం నుండి  నాగం జనార్ధ్ రెడ్డి తనయుడు  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ఆ ఎన్నికల్లో  మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి  బీజేపీ  అభ్యర్ధిగా  పోటీ  చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత  చోటు  చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  నాగం జనార్థన్ రెడ్డి  బీజేపీని వీడి కాంగ్రెస్ లో  చేరారు.  ప్రస్తుతం  నాగర్ కర్నూల్ నుండి  మరోసారి  పోటీకి  నాగం జనార్ధన్ రెడ్డి  పోటీకి  సమాయత్తమౌతున్నారు.
 
బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

అయితే  అదే సమ యంలో  కూచకుళ్ల దామోదర్ రెడ్డి  ఆయన తనయుడు  పార్టీలో చేరితే  వారిని  కాంగ్రెస్ పార్టీ ఎలా సంతృప్తి  పరుస్తుందోనననే సర్వత్రా  చర్చ సాగుతుంది.

బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

ఇటీవల  కాలంలో  కాంగ్రెస్ పార్టీ  నేత, మాజీ ఎంపీ  మల్లురవితో  కూచకుళ్ల దామోదర్ రెడ్డి  సమావేశం  కావడం నాగర్ కర్నూల్ జిల్లాలో  రాజకీయంగా  చర్చకు దారితీసింది.  కాంగ్రెస్ పార్టీలో  చేరే విషయమై  మల్లు రవితో   కూచకుళ్ల దామోదర్ రెడ్డి  చర్చించారనే ప్రచారం సాగుతుంది. 

బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

ఏడాది కాలంగా  కూచకుళ్ల  దామోదర్ రెడ్డి  బీఆర్ఎస్ ను వీడుతారని ప్రచారం సాగుతుంది. అయితే  ఇటీవల  దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు  అడుగులు  ఇందుకు  అనుగుణంగా  ఉన్నాయనే  సంకేతాలు  ఇస్తున్నారు.

బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ

కూచకుళ్ల దామోదర్ రెడ్డిని  బీజేపీలో  చేరాలని  ఆ పార్టీ నాయకత్వం కూడ  కోరిందని సమాచారం.  మాజీ మంత్రి, బీజేపీ  నేత  డీకే  అరుణదామోదర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారని జిల్లాలో ప్రచారంలో  ఉంది. అయితే   బీజేపీ కంటే  కాంగ్రెస్ లో  వైపే   కూచకుళ్ల దామోదర్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

click me!