మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు ఉదయం ఢిల్లీకి బయలు దేరారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఈటల రాజేందర్ కు బీజేపీలో మరో పదవిని ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది
25
ఢీల్లీకి ఈటల: బీజేపీలో మరో పదవి కేటాయిస్తారా?
బీజేపీలో చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో ఈటల రాజేందర్ చర్చించారు. బీజేపీలో చేరాలని ఈ ఇద్దరు నేతలను ఆహ్వానించారు. అయితే ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. పార్టీలో చేరాలని ఆహ్వానించే సమయంలో నేతలకు పార్టీలో చేరేందుకు వచ్చే నేతలకు హామీలు ఇచ్చే విషయమై ఈటల రాజేందర్ కు కొన్ని ఇబ్బందులున్నాయనే ప్రచారం కూడ లేకపోలేదు.
35
ఢీల్లీకి ఈటల: బీజేపీలో మరో పదవి కేటాయిస్తారా?
మరో వైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఈటల రాజేందర్ కు కొంత గ్యాప్ పెరిగిందని అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
45
ఢీల్లీకి ఈటల: బీజేపీలో మరో పదవి కేటాయిస్తారా?
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం వెళ్లింది. అయితే ఈ సమాచారం తనకు తెలియదని బండి సంజయ్ మీడియాకు చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడ ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించాలని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరినట్టుగా ప్రచారం సాగింది. పార్టీ నాయకత్వం ఈ విషయమై సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడ ఇటీవల స్పష్టం చేశారు.
55
ఢీల్లీకి ఈటల: బీజేపీలో మరో పదవి కేటాయిస్తారా?
ఈ పరిణామాల తర్వాత ఇవాళ ఈటల రాజేందర్ న్యూఢిల్లీకి వెళ్లాడు. బీజేపీ అగ్రనేతలను కలుస్తారు. బీజేపీ చేరికల కమిటీతో పాటు ఇతర బాధ్యతలను ఈటల రాజేందరు్ కు కట్టబెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరహలోనే బీజేపీ ప్రచార కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మెన్ గా ఈటల రాజేందర్ ను నియమించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ విషయమై బీజేపీ నాయకత్వం నుండి స్పష్టత రావాల్సి ఉంది.