Kalvakuntla Kavitha
డిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. దాదాపు ఐదు నెలల జైలుజీవితం తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇలా తమ పార్టీ నాయకురాలు జైలు నుండి విడుదల కావడంతో బిఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు... స్వయంగా కవిత మిఠాయిలు పంచారు. ఇలా కవిత లిక్కర్ స్కాం లో అరెస్టవడం నుండి ఇప్పుడు బెయిల్ వరకు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కవిత మాజీ సీఎం కేసీఆర్ కూతురు కావడంతో ఈ వ్యవహారంపై ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.
Kalvakuntla Kavitha
అయితే కేసీఆర్ కూతురే కాదు ఇప్పటివరకు దేశంలోని అనేక రాష్ట్రాల మాజీ సీఎంల పిల్లలు కూడా జైలుకెళ్లారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలగా సంపాదించారనే ఆరోపణలతోనే చాలామంది జైలుకెళ్లారు. మరికొందరి అరెస్ట్ కు వేరువేరు కారణాలున్నాయి. ఏదేమైనా తండ్రులు రాజకీయాలను శాసించే స్థాయిలో వున్నా బిడ్డలను జైలుకెళ్లకుండా కాపాడుకోలేకపోయారు. ఇలా ఇప్పటివరకు జైలుకెళ్లిన మాజీ సీఎంల పిల్లలెరవో చూద్దాం.
Kalvakuntla kavitha
కల్వకుంట్ల కవిత :
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుగా రాజకీయ రంగప్రవేశం చేసారు కల్వకుంట్ల కవిత. ఆమె నిజామాబాద్ మాజీ ఎంపీగా, ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ. తండ్రి ముఖ్యమంత్రిగా వున్న పదేళ్లపాటు కవిత భారీగా సంపాదించారని ... లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర బయటపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కామ్ లో కవిత కీలకపాత్ర పోషించారంటూ ఈడి, సిబిఐ గుర్తించాయి. దీంతో పలుమార్లు ఆమెను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు చివరకు అరెస్ట్ చేసాయి.
YS Jaganmohan Reddy
వైఎస్ జగన్మోహన్ రెడ్డి :
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇలాగే అరెస్టయ్యారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఈ సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు జగన్ పై ఆరోపణలున్నాయి. అయితే తండ్రి వైఎస్సార్ అకాలమరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో విబేధించి బయటకు రావడంతో జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై యాక్షన్ ప్రారంభమయ్యింది. ఆయన అక్రమాస్తులపై దర్యాప్తు జరిపిన సిబిఐ 2012 లో అరెస్ట్ చేసింది. చాలాకాలం ఆయన జైలుజీవితం గడిపారు.
kanimoli
కనిమొళి :
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కనిమొళి కూడా జైలుజీవితం గడిపారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటయిన 2G స్పెక్ట్రమ్ కేసులో ఆమెను అరెస్ట్ చేసారు. ఆనాటి కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజాతో కలిసి ఈమె అవినీతికి పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. దీంతో 2011 లో ఈమెను సిబిఐ అరెస్ట్ చేసింది. చాలాకాలం తీహార్ జైల్లో వున్న ఈమె బెయిల్ పై విడుదలయ్యారు.
Hemant soren
హేమంత్ సోరెన్ :
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ తనయుడు హేమంత్ సోరెన్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హేమంత్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా వున్నారు. అయితే భూ ఒప్పందాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడి 2024 జనవరి 20న అరెస్ట్ చేసింది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఐదునెలల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
chandrababu revanth reddy
ఇలా పలువరు మాజీ సీఎంల పిల్లలు వివిధ కేసుల్లో అరెస్టయ్యారు. ఆసక్తికర విషయం ఏంటంటే జైలుకు వెళ్లివచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు... జార్ఖండ్ సీఎం అయ్యాక హేమంత్ సోరెన్ జైలుకు వెళ్ళారు. ఇక ముఖ్యమంత్రిగా వుండగా అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, జయలలిత, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జైలు జీవితం గడిపారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కొడుకు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ 370 ఆర్టికల్ రద్దు సమయంలో గృహనిర్భందంలో వున్నారు.