నోటిఫికేషన్ లో ఏ పోస్టుకు ఏ అర్హతలు వుండాలో పేర్కొన్నారు. మీకు ఆ అర్హతలు వుంటే ఈ నెల (ఆగస్ట్) 24 లోపు దరఖాస్తు చేసుకొండి. కేవలం ఆఫ్ లైన్ లోనే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు మీరు ఎంపికయితే ప్రతినెలా రూ.32,000 వేల జీతం పొందవచ్చు.
పోస్టులను భట్టి విద్యార్హతలు, వయో పరిమితి నిర్ణయించారు. అలాగే దరఖాస్తు వివరాలు, ఫీజు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.nims.edu.in/ చూడండి. ఈ నెల 24,2024 లోపు పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లోని ఓల్డ్ ఓపిడి బ్లాక్ లోని ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు అందించవచ్చు. అయితే ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.